breaking news
shotdead
-
బీహార్‌లో ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ నేత దారుణ హత్య
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ బీహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడు గోపాల్ ఖేమ్కాపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో గోపాల్ అక్కడిక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన బీజేపీ నాయకుడు గోపాల్ ఖేమ్కా శుక్రవారం రాత్రి పాట్నాలోని తన ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇంటి వద్ద కొందరు దుండగులు.. ఆయనపై కాల్పులు జరిపారు. గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పనాచే హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. గోపాల్.. హోటల్‌కు ఆనుకుని ఉన్న ట్విన్ టవర్ సొసైటీలో నివాసం ఉంటున్నారు. నిందితుడు ఆయనపై కాల్పులు జరిపిన వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కాల్పుల్లో గోపాల్ ఖేమ్కా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఒక బుల్లెట్, షెల్ కేసింగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా సిటీ ఎస్పీ దీక్ష మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గోపాల్ ఖేమ్కాపై కాల్పులు జరిగినట్టు మాకు సమాచారం అందించింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆయనను ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందారు. నిందితుడిని గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. ఈ హత్య వెనుక కారణం ఇంకా తెలియలేదు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.VIDEO | Patna, Bihar: Businessman Gopal Khemka shot dead near his house. Visuals from his residence. Police investigation on.#BiharNews #PatnaNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/ZkHIzWJbnE— Press Trust of India (@PTI_News) July 5, 2025ఇదిలా ఉండగా.. ఆయన కుమారుడు గుంజన్ ఖేమ్కా మూడేళ్ల క్రితం హత్యకు గురయ్యారు. మరోవైపు.. పూర్నియాకు చెందిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ అలియాస్ రాజేష్ రంజన్ నిన్న రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‌లో ఎవరూ సురక్షితంగా లేరు. బీహార్ నేరస్థులకు స్వర్గధామంగా మారింది. నితీష్ జీ.. దయచేసి బీహార్‌ను విడిచిపెట్టండి. గుంజన్ ఖేమ్కా హత్యకు గురైనప్పుడే నేరస్థులపై చర్యలు తీసుకుని ఉంటే.. ఈరోజు గోపాల్ ఖేమ్కాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు.#WATCH | Patna, Bihar | On businessman Gopal Khemka being shot dead, SP Patna Diksha says, "On the night of July 4, at around 11 pm, we received information that businessman Gopal Khemka has been shot dead in the south area of the Gandhi Maidan... The crime scene has been… pic.twitter.com/o8C0gVoz7B— ANI (@ANI) July 5, 2025 -
ప్రముఖ నగల వ్యాపారి కాల్చివేత
శ్రీనగర్: నూతన సంవత్సరం తొలి రోజే శ్రీనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. స్థానిక బిజీ మార్కెట్లో వ్యాపారి సత్పాల్ సింగ్ (62) పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. సారాయ్ బాలా వద్ద గురువారం ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి వెల్లడించారు. ఎందుకు కాల్పులకు తెగబడ్డారనే దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టతలేదు. సింగ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
బీజేపీ ఉపాధ్యక్షుడి కాల్చివేత
శ్రీనగర్ : లోక్‌సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్‌కు కొద్దిగంటల ముందు అనంత్ నాగ్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గుల్ మహ్మద్ మిర్ నివాసాన్ని చుట్టముట్టిన ఉగ్రవాదులు ఆయనను కాల్చిచంపారు. జిల్లాలోని నౌగ్రాం గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 2008, 2014లో జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో దురూ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మిర్ చాలాకాలంగా బీజేపీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. మిర్‌కు భద్రతను అధికారులు ఉపసంహరించడంతో ఈ దారుణం జరిగిందని బీజేపీ ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ ఆరోపించారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నా మిర్‌కు భద్రతా సంస్ధలు భద్రతను కల్పించలేకపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొద్దిరోజులుగా మిర్‌కు భద్రతపై అధికారులకు తాము పలుమార్లు విన్నవించినా ఎలాంటి ఫలితం లేకపోయిందని అన్నారు. మిర్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉండగా, ఓ కుమారుడు పారామిలటరీ బలగాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదుల నుంచి ఎదురయ్యే ముప్పును దృష్టిలో ఉంచుకుని అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో మూడు విడతల పోలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సోమవారం జరగనున్న అయిదో దశ పోలింగ్‌కు 48 గంటల ముందు బీజేపీ నేతను ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది. -
అమెరికాలో భారత అధికారి కాల్చివేత
కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన పోలీస్ అధికారిని ట్రాఫిక్ విధుల్లో ఉండగా గుర్తుతెలియని సాయుధ దుండగుడు కాల్చిచంపాడు. న్యూమాన్ పోలీస్ విభాగానికి చెందిన కర్పోరల్ రొనిల్ సింగ్ (33) క్రిస్మస్ రాత్రి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తుండగా, వాహనంపై వచ్చిన దుండగుడు ఆయనపై నేరుగా కాల్పులు జరిపాడు. ఘటనా స్ధలంలో గాయాలతో పడిఉన్న సింగ్‌ను స్ధానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. కాగా ఆయనపై కాల్పులు జరిపిన వెంటనే పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకునేలోపు నిందితుడు పరారయ్యాడని అధికారులు తెలిపారు. పోలీసులు నిందితుడి ఊహాచిత్రంతో పాటు, వాహనం వివరాలను వెల్లడిస్తూ తమకు అనుమానితుడి సమాచారం అందించాలని కోరారు. కర్పోరల్ సింగ్‌కు భార్య అనామిక, ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. కాల్పులు జరిగే కొద్ది గంటల ముందే కర్పోరల్ సింగ్ క్రిస్మస్ వేడుకల్లో భార్య, కుమారుడితో ఆనందంగా గడిపారని, వారితో కలిసి ఫోటోలు దిగారని స్ధానికులు తెలిపారు. కాగా సింగ్ మృతికి పోలీస్ అధికారులు సంతాపం తెలిపారు. కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ బ్రౌన్ సింగ్ భార్య, కుమారుడు, కొలీగ్స్‌కు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
లైవ్‌లో మాట్లాడుతుండగా.. రేడియో జాకీ హత్య
రియోడిజనీరో: బ్రెజిల్లో దారుణ ఘటన జరిగింది. ఓ రేడియో జాకీని దుండగులు అతి కిరాతకంగా కల్చి చంపారు. లైవ్ కార్యక్రమం నిర్వహిస్తుండగానే రేడియో స్టేషన్లోకి ప్రవేశించిన ఇద్దరు ముసుగులు ధరించిన దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళ్తే.. జోవా వెల్డసిర్ డీ బోర్బా(52) బ్రెజిల్ రేడియో డిఫ్యుసొరా ఏఎమ్లో వ్యాఖ్యాతగా పనిచేస్తున్నాడు. ఇంతకు ముందు 10 ఏళ్లుగా నేర సంఘటనలను రిపోర్ట్ చేసే కార్యక్రమాలు నిర్వహించిన బోర్బా ఇటీవలే సంగీతానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రేడియో కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన బోర్బాను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ సమయంలో బోర్బా పాటు ఉన్న సహోద్యోగి ఈ ఘటనపై మాట్లాడుతూ.. సిగరెట్ తాగడానికి తాను బయటకు వెళ్లి వచ్చే సరికి దుండగులు కాల్పులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని స్థానిక పోలీసులు వెల్లడిచారు. క్రైమ్ ఘటనలను రిపోర్ట్ చేసే సమయంలోనే బోర్బాకు నేరస్తుల నుంచి పలుమార్లు హెచ్చరికలు వచ్చాయని తెలుస్తోంది. గత ఏడాది కాలంగా బ్రెజిల్లో ఎనిమిది మంది రేడియో వ్యాఖ్యాతలు హత్యకు గురయ్యారని బ్రెజిల్ అసోసియేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ప్రజెంటర్స్ వెల్లడించింది.