సభలో కలకలం.. తేజస్వీ వైపు దూసుకొచ్చిన డ్రోన్‌ | Drone Hits Podium As Tejashwi Yadav Addresses Crowd In Bihar, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

సభలో కలకలం.. తేజస్వీ వైపు దూసుకొచ్చిన డ్రోన్‌

Jun 29 2025 7:16 PM | Updated on Jun 30 2025 12:20 PM

Drone Hits Podium As Tejashwi Yadav Addresses Crowd In Bihar

పాట్నా: ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆదివారం.. పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్‌లో ‘సేవ్‌ వక్ఫ్‌, సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’ పేరిట ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తేజస్వీ ప్రసంగిస్తుండగా ఆయన వైపు ఓ డ్రోన్‌ దూసుకొచ్చింది. 

ర్యాలీ వీడియో కవర్‌ చేసేందుకు డ్రోన్‌ ఏర్పాటు చేశారు. ఆ డ్రోన్‌.. తేజస్వీ యాదవ్‌ మాట్లాడుతుండగా దిశ మారి.. హఠాత్తుగా ఆయన వైపుకు వెళ్లింది. దీంతో వెంటనే అప్రమత్తమైన తేజస్వీ యాదవ్‌ తన ప్రసంగాన్ని ఆపేసి వెనక్కి జరిగి.. ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు.

కాగా, భద్రతా సిబ్బంది డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై పాట్నా సెంట్రల్‌ ఎస్పీ దీక్ష స్పందించారు. ఘటన జరిగిన ప్రాంతం.. నిషేధిత ప్రదేశమని డ్రోన్లు ఎగరవేయకూడదని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement