శానిటరీ నేప్కిన్స్‌ ప్యాకెట్లపై రాహుల్‌ బొమ్మ | Rahul Gandhi's Picture On Sanitary Pad Row | Sakshi
Sakshi News home page

శానిటరీ నేప్కిన్స్‌ ప్యాకెట్లపై రాహుల్‌ బొమ్మ

Jul 5 2025 8:22 AM | Updated on Jul 5 2025 10:22 AM

Rahul Gandhi's Picture On Sanitary Pad Row

పట్నా: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మహిళలను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్‌ చేసిన ప్రయత్నం విమర్శలపాలైంది. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళలకు ఉచితంగా శానిటరీ నేప్కిన్స్‌ను పంపిణీ చేయాలని పార్టీ తలపెట్టింది. అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2,500 అందజేయడంతోపాటు ఉచితంగా నేప్కిన్లు అందజేస్తామని ప్రకటించింది. ఆ ప్యాకెట్లపై రాహుల్‌ గాంధీ బొమ్మను ముద్రించడం వివాదం రేపింది. కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయాలకు ఇదో ఉదాహరణ అంటూ అధికార జేడీ(యూ) మండిపడింది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement