ఇయర్‌ ఫోన్లు వాడండి.. లేకుంటే జైలుకే..! | Indian Railways Loudspeaker Fine Jail Rules | Sakshi
Sakshi News home page

ఇయర్‌ ఫోన్లు వాడండి.. లేకుంటే జైలుకే..!

Oct 20 2026 8:46 AM | Updated on Oct 20 2026 8:46 AM

Indian Railways Loudspeaker Fine Jail Rules

రైళ్లలో సెల్‌ఫోన్‌ వాడకంపై దక్షిణ రైల్వే జోన్‌ హెచ్చరిక

సాక్షి, చెన్నై: రైలు ప్రయాణాల సమయంలో సెల్‌ ఫోన్‌ స్పీకర్లలో అధిక శబ్ధంతో పాటలు వింటూ, వీడియోలు చూస్తూ తోటి వారికి ఇబ్బంది కలిగించే వారిపై దక్షిణ రైల్వే ఇకపై కఠినంగా వ్యవహరించనుంది. ఇయర్‌ ఫోన్లు వాడకుండా, ఫోన్‌ స్పీకర్లను ఆన్‌ చేసే వారికి జరిమానాలతో పాటు శిక్షలు కూడా తప్పవంటూ హెచ్చరికలు చేసింది. ఈ మేరకు ఈ నెల 6వ తేదీన ఒక సర్క్యులర్‌ విడుదల చేసింది. ప్రయాణికుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

ఈ నిబంధనలపై ప్రయాణికుల్లో అవగాహన కల్పించేందుకు హిందీ, ఇంగ్లిష్, స్థానిక భాషల్లో రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రకటనలు చేయనుంది. ప్రయాణికులు విధిగా హెడ్‌ఫోన్‌లు ఉపయోగించాలని, బిగ్గరగా ఫోన్‌ కాల్స్‌ మాట్లాడవద్దని సూచించింది. తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే వారికి రూ.1,000 వరకు జరిమానా విధించడంతో పాటు, వారిని రైలు లేదా స్టేషన్‌ నుంచి కిందకి దించేసే అవకాశం ఉంటుంది.

పదేపదే ఈ నిబంధనను ఉల్లంఘించే వారికి రూ.5,000 వరకు జరిమానాతో పాటూ 6 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చని రైల్వే స్పష్టం చేసింది. జరిమానాలు విధించే అధికారాన్ని రైళ్లలో విధుల్లో ఉండే టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ (టీటీఈ)లకు, వాణిజ్య విభాగానికి చెందిన సీనియర్‌ అధికారులకు అప్పగించామని తెలిపింది. దక్షిణ రైల్వేతోపాటు ఉత్తర, పశ్చిమ రైల్వే జోన్లు కూడా ఇలాంటి నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించాయి.

ఇదీ చదవండి: రాముడి పేరుతో అధికారంచందాల చోరీపై మౌనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement