పాట్నా: బిహార్లో జేడీయూ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిష్టానం తన ప్రత్యర్థి నీరజ్ కుమార్కు టికెట్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా అనంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. మాజీ సీఎం నితీశ్ కుమార్కు మద్దతుతో తొమ్మిది మందిని హత్య చేయించానని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజకీయంగా దుమారం చెలరేగింది. వెను వెంటనే ఆ తర్వాత మాట మార్చారు. ఆ హత్యలకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
మరోవైపు ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ వ్యాఖ్యలపై ఆర్జేడీ తీవ్రంగా స్పందించింది. అనంత్ సింగ్ వ్యాఖ్యలు రాజకీయ హత్యలను ప్రేరేపించే విధంగా ఉన్నాయని ఆ పార్టీ నేత శక్తి సింగ్ యాదవ్ విమర్శించారు. నితీశ్ కుమార్కు ఎలాంటి నేరస్తులతోనూ సంబంధాలు లేవని, ఇలాంటి వ్యాఖ్యలను ఎవరూ తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కీలక ముందడుగు


