హద్దు మీరిన పాక్‌ సైన్యం... బుద్ధి చెప్పిన భారత జవాన్లు | Pakistan Army Violates Ceasefire After Mine Blast Along LoC In J&K Poonch, Indian Army Hits Back | Sakshi
Sakshi News home page

హద్దు మీరిన పాక్‌ సైన్యం... బుద్ధి చెప్పిన భారత జవాన్లు

Apr 3 2025 5:46 AM | Updated on Apr 3 2025 11:34 AM

Pakistan Army violates ceasefire after mine blast along LoC

ఎల్‌ఓసీ వద్ద కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాక్‌ 

జమ్మూ: పాకిస్తాన్‌ సైన్యం మరోసారి హద్దు మీరింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత భూభాగంపై కాల్పులు జరిపింది. అప్రమత్తమైన భారత సైన్యం గట్టిగా బదులివ్వడంతో పాక్‌ సైన్యం తోకముడిచింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వద్ద ఈ ఘటన జరిగినట్లు భారత సైనిక అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ఎల్‌ఓసీ వద్ద కృష్ణా ఘాటీ సెక్టార్‌లో తొలుత మందుపాతర పేలుడు సంభవించిందని, ఆ తర్వాత పాక్‌ భూభాగం నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు మొదలయ్యాయని అన్నారు.

 అక్కడే విధుల్లో ఉన్న భారత సైన్యం వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపిందని తెలిపారు. భారత సైన్యం నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకావడంతో చేసేది లేక పాక్‌ సైన్యం వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్‌ఓసీ వద్ద పరిస్థితి నియంత్రణలోనే ఉందని స్పష్టంచేశారు. ఎల్‌ఓసీ వెంట భారత సైన్యం పట్టు కొనసాగుతోందని తెలియజేశారు. అయితే, ఈ కాల్పుల ఘటనలో పాక్‌ సైన్యానికి ఏమైనా ప్రాణనష్టం వాటిల్లిందా? అనేది బయటపెట్టలేదు. ఐదుగురు పాక్‌ జవాన్లు గాయపడినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement