
కుల్గామ్: ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మరీ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఆక్హాల్‌లో మరో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలోని ఫారెస్ట్ ఏరియా సమీపంలో ఆదివారం ఉదయం ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమవ్వగా, ఒక సైనికుడు గాయపడ్డారు.
నిన్న రాత్రి నుంచి భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నేటి(ఆదివారం, ఆగస్టు 3) ఉదయం ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. దాంతో శని, ఆదివారాల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు చేరినట్లుఉ పేర్కొన్నారు. శనివారం సైతం ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చారు.
ఉగ్రవాదులు కుల్గామ్ పారెస్ట్ ఏరియాలో మకాం వేసినట్లు తమకు అందిన సమాచారం మేరకు ఆపరేషన్ అక్హాల్ చేపట్టామన్నారు. దీనిలో భాగంగా ఈ రెండు రోజుల్లో ఆరుగురు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లుఉ పేర్కొన్నారు. వీరు ద రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.