పాక్‌పై దౌత్య యుద్ధానికి  బృంద సారథులు వీరే | Seven all party teams to take India anti-terror stand global | Sakshi
Sakshi News home page

పాక్‌పై దౌత్య యుద్ధానికి  బృంద సారథులు వీరే

May 18 2025 5:48 AM | Updated on May 18 2025 11:18 AM

Seven all party teams to take India anti-terror stand global

ఏడుగురిని ప్రకటించిన కేంద్రం  

నెలాఖరు నుంచి విదేశాల్లో పర్యటన  

విపక్షాల నుంచి థరూర్, కనిమొళి, సూలే 

ఎన్డీఏనుంచి రవిశంకర్‌ ప్రసాద్, పండా, షిండే, ఝా 

సాక్షి, న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టిన భారత్‌ దౌత్యపరంగానూ బుద్ధి చెప్పడానికి సిద్ధమైంది. పాక్‌ అరాచకాలను, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాలకు వివరించనుంది. ఇందుకోసం పలు పార్టిల నేతలు, ఎంపీలు, దౌత్యవేత్తలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందం నాలుగు నుంచి ఐదు దేశాల్లో పర్యటించనుంది. 

విపక్షాల నుంచి శశి థరూర్‌ (కాంగ్రెస్‌), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ–పవార్‌), అధికార ఎన్డీఏ కూటమి నుంచి రవిశంకర్‌ ప్రసాద్, బైజయంత్‌ పాండా (బీజేపీ), సంజయ్‌ కుమార్‌ ఝా (జేడీయూ), శ్రీకాంత్‌ షిండే (శివసేన–షిండే) వాటికి సారథ్యం వహిస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ శనివారం ఈ మేరకు వెల్లడించింది.

 బృందాల్లో సభ్యులుగా అనురాగ్‌ ఠాకూర్, అపరాజితా సారంగి, మనీశ్‌ తివారీ, అసదుద్దీన్‌ ఒవైసీ, అమర్‌ సింగ్, రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, సమిక్‌ భట్టాచార్య, బ్రిజ్‌లాల్, సర్ఫరాజ్‌ అహ్మద్, ప్రియాంక చతుర్వేది, విక్రమ్‌జిత్‌ సాహ్నీ, సస్మిత్‌ పాత్ర, భువనేశ్వర్‌ కలితాతో పాటు కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ తదితరులు ఉంటారు. వారంతా ఈ నెలాఖర్లో ఐరాస భద్రతా మండలితో పాటు పలు కీలక దేశాల్లో పర్యటిస్తారు.

ఏ బృందం ఏ దేశానికి... 
శశి థరూర్‌: అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా 
సుప్రియా సూలే: ఈజిప్‌్ట, ఖతర్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా 
కనిమొళి: రష్యా, స్పెయిన్, గ్రీస్, స్లొవేనియా, లాతి్వయా 
సంజయ్‌ కుమార్‌ ఝా: జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, మలేషియా, ఇండోనేసియా 
రవిశంకర్‌ ప్రసాద్‌: ఈయూ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్‌ 
బైజయంత్‌ పండా: సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా 
శ్రీకాంత్‌ షిండే: యూఏఈ, లైబీరియా, కాంగో, సియెర్రా లియోన్‌  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement