breaking news
MPs list
-
పాక్‌పై దౌత్య యుద్ధానికి బృంద సారథులు వీరే
సాక్షి, న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టిన భారత్ దౌత్యపరంగానూ బుద్ధి చెప్పడానికి సిద్ధమైంది. పాక్ అరాచకాలను, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాలకు వివరించనుంది. ఇందుకోసం పలు పార్టిల నేతలు, ఎంపీలు, దౌత్యవేత్తలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందం నాలుగు నుంచి ఐదు దేశాల్లో పర్యటించనుంది. విపక్షాల నుంచి శశి థరూర్ (కాంగ్రెస్), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ–పవార్), అధికార ఎన్డీఏ కూటమి నుంచి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా (బీజేపీ), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), శ్రీకాంత్ షిండే (శివసేన–షిండే) వాటికి సారథ్యం వహిస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ శనివారం ఈ మేరకు వెల్లడించింది. బృందాల్లో సభ్యులుగా అనురాగ్ ఠాకూర్, అపరాజితా సారంగి, మనీశ్ తివారీ, అసదుద్దీన్ ఒవైసీ, అమర్ సింగ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, సమిక్ భట్టాచార్య, బ్రిజ్‌లాల్, సర్ఫరాజ్ అహ్మద్, ప్రియాంక చతుర్వేది, విక్రమ్‌జిత్ సాహ్నీ, సస్మిత్ పాత్ర, భువనేశ్వర్ కలితాతో పాటు కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తదితరులు ఉంటారు. వారంతా ఈ నెలాఖర్లో ఐరాస భద్రతా మండలితో పాటు పలు కీలక దేశాల్లో పర్యటిస్తారు.ఏ బృందం ఏ దేశానికి... శశి థరూర్: అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా సుప్రియా సూలే: ఈజిప్‌్ట, ఖతర్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా కనిమొళి: రష్యా, స్పెయిన్, గ్రీస్, స్లొవేనియా, లాతి్వయా సంజయ్ కుమార్ ఝా: జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, మలేషియా, ఇండోనేసియా రవిశంకర్ ప్రసాద్: ఈయూ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్ బైజయంత్ పండా: సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా శ్రీకాంత్ షిండే: యూఏఈ, లైబీరియా, కాంగో, సియెర్రా లియోన్ -
రాష్ట్రపతికి చేరిన లోక్ సభ అభ్యర్థుల జాబితా
న్యూఢిల్లీ: త్వరలో కొత్తగా కొలువు తీరనున్న 16వ లోక్ సభకు సంబంధించిన అభ్యర్థుల జాబితా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి చేరింది. తాజాగా ఎన్నికైన ఎంపీల జాబితా వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సంపత్ ఆదివారం రాష్ట్రపతికి అందజేశారు. ఈ జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. లోక్ సభ చరిత్రలోనే అత్యధికం మహిళలు ఎంపిక కావడం ఇదే తొలిసారి. మొత్తం ఉన్న 543 ఎంపీల్లో 61 మంది మహిళలు ఉన్నారు. ఇదిలా ఉండగా 55 ఏళ్లకు పైబడిన వారిలో 47 శాతం మంది ఎంపీలు ఉన్నారు. ఈసారి లోక్ సభకు ఎన్నికైన అభ్యర్థుల్లో 75 శాతం మంది ఎంపీలు మాత్రమే పట్టభద్రుల హోదా దక్కించుకున్నారు. ఇది 15వ లోక్ సభ తో పోల్చుకుంటే దాదాపు నాలుగు శాతం తక్కువగానే కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా ఎన్నికైన వారిలో 10 శాతం మంది మెట్రిక్యూలేషన్ దాటిన వారుకూడా ఉండగా, అసలు ఆ పరిధి దాటని వాళ్లు 13 శాతం మంది ఎంపీలు ఉన్నారు. ఇలా మెట్రిక్యూలేషన్ కూడా పొందని వారు మాత్రం గతం కంటే 10 శాతం ఎక్కువ.కాగా, డాక్టరేట్ పట్టా ఉన్న ఎంపీల సంఖ్యమాత్రం 2009 కంటే ఎక్కువగా నమోదైంది. ఆ హోదా కల్గిన వారు 3 శాతం నుంచి 6 శాతానికి పెరిగారు. మరి కొద్దిరోజుల్లో కొత్త లోక్ సభ ఏర్పాటు అవుతున్న తరుణంలో 15 వ లోక్ సభను రాష్ట్రపతి రద్దు చేశారు.