
న్యూఢిల్లీ: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన కీలక వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వెల్లడించింది. పహల్గామ్‌లోని బేసరన్‌లో జరిగిన దాడికి ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కారణమని నిర్ధారించింది.
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందారు. సరిహద్దుల్లో భారత సైన్యం చేపడుతున్న ఆపరేషన్ మహాదేవ్ నేపధ్యంలో ఎన్‌ఐఏ ఈ ప్రకటన చేసింది. అయితే గతంలో ఈ దాడి వెనుక పలువురు ఉండవచ్చని భావించారు. అయితే ఇప్పుడు ఎన్‌ఐఏ తన దర్యాప్తులో ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు ఈ దాడికి కారకులని నిర్థారించింది. బైసరన్ పర్యాటక ప్రాంతం కాస్త దూరంలో ఉండటం, పోలీసు ఉనికి తక్కువగా ఉండటం, పర్యాటకుల రద్దీ అధికంగా ఉండటాన్ని ఈ ముగ్గురు ఉగ్రవాదులు గమనించారని ఎన్‌ఐఏ భావిస్తోంది.
ఈ ముగ్గురు ఉగ్రవాదులు స్థానికంగా ఆశ్రయం పొందేందుకు భూగర్భ కార్మికులకు మూడు వేల రూపాయలు చెల్లించారని ఎన్‌ఐఏ గుర్తించింది. కాగా పహల్గామ్ దర్యాప్తుతో పాటు ఎన్‌ఐఏ అధికారులు మాలేగావ్ పేలుడు కేసు తీర్పును ప్రస్తావించారు. చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కేసు ఫైల్‌ను సమీక్షిస్తున్నారు. తదుపరి చర్యపై నిర్ణయాలు తీసుకునే ముందు ఎన్‌ఐఏ కోర్టు తీర్పులోని అన్ని అంశాలను పరిశీలిస్తోంది.