
- ఆపరేషన్ సిందూర్ పై తప్పుడు కథనాలు రాస్తారా?
- చైనా మీడియాపై భారత్ ఆగ్రహం
- మీరు వార్తలు ప్రచురించేటప్పుడు వాస్తవాలు పరిశీలించుకోండి
- ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి
- పాత ఫోటోలతో మభ్యపెట్టి వార్తలను ప్రచురిస్తారా?
- చైనాలోని భారత్ ఎంబాసీ ధ్వజం
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల్ని ప్రాణాలు పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల వేరివేత లక్ష్యంగా భారత్ ‘ ఆపరేషన్ సిందూర్’ నిర్వహించింది. పాక్ లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసిన భారత్.. 90 మంది వరకూ టెర్రర్ మూకలను మట్టుబెట్టింది. అయితే భారత్ విజయవంతంగా పూర్తి చేసిన ఆపరేషన్ సిందూర్ పై చైనా మీడియా విషం కక్కింది. చైనాలోని గ్గోబల్ టైమ్స్’ అనే మీడియా సంస్థ ఆపరేషన్ సిందూర్ భారత్ విమానాలను పాక్ కూల్చిందంటూ తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది.
కొన్ని పాత ఫోటోలను జత చేసి వాటిని ప్రస్తుత ఆపరేషన్ సిందూర్ కు ఆపాదించింది. దీనిపై చైనాలోని భారత్ ఎంబాసీ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అక్కడ జరిగింది ఏమిటి.. మీరు చేస్తున్నదేమిటి అంటూ మండిపడింది ఒక విషయాన్ని వార్త రూపంలో ప్రచురించేటప్పుడు వాస్తవాలను తెలుసుకోవాలని, దానికి మూలాలను అన్వేషించి వార్తలు వేయాలని గ్లోబల్ టైమ్స్ కు చురకలంటించింది. అక్కడా ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసి విజయవంతంగా దాన్ని పూర్తి చేస్తే మీరు దాన్ని వక్రీకరించడం తగదంటూ హితవు పలికింది.
కాగా, ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులు హతమయ్యారు.