
అనూహ్య పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు, యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో చాటేందుకు.. దేశవ్యాప్తంగా సివిల్ డిపెన్స్ మాక్ డ్రిల్ జరిగింది. దాదాపు 54 ఏళ్ల అనంతరం దేశవ్యాప్తంగా పౌర రక్షణ, సన్నద్ధత విన్యాసాలు నిర్వహించారు. 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరిట ఈ డ్రిల్స్ జరిగాయి. మాక్ డ్రిల్స్‌లో భాగంగా వైమానిక దాడుల హెచ్చరికలతో సైరన్లు వినిపించాయి.
👉హైదరాబాద్, విశాఖ సహా 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్
👉సికింద్రాబాద్, గోల్గొండ, కంచన్‌బాగ్ డీఆర్‌డీఏ, మౌలాలీలోని ఎన్‌ఎఫ్‌సీలో డిఫెన్స్ బృందాల మాక్ డ్రిల్
👉విశాఖ వన్ టౌన్‌లో మాక్ డ్రిల్
👉వైమానిక దాడులపై అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్
👉ఎక్కడెక్కడ జరిగాయంటే..
దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ఎంపిక చేసిన 259 చోట్ల మాక్‌డ్రిల్స్ జరిగాయి. వీటిలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రోలు కూడా ఉన్నాయి. 100కు పైగా సీడీడీలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి ‘ఎ’ కేటగిరీలో చేర్చారు. వాటి పరిధిలో సూరత్, వడోదర, కాక్రపార్ (గుజరాత్), కోట (రాజస్తాన్), బులంద్‌షహర్ (యూపీ), చెన్నై, కల్పకం (తమిళనాడు), తాల్చెర్ (ఒడిశా), ముంబై, ఉరన్, తారాపూర్ (మహారాష్ట్ర), ఢిల్లీ ఉన్నాయి.
మాక్‌డ్రిల్ వల్ల ప్రజలు ఎవరూ భయపడొద్దు: సీవీ ఆనంద్
సైరన్ మోగగానే ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలి
ఇళ్లలో ఉన్నవాళ్లు ఇళ్లలోనే ఉండాలి
బయట ఉన్నవాళ్లు సమీప భవనాల్లోకి వెళ్లాలి
👉ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది.
👉ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పై సీఎం సమీక్ష నిర్వహించారు.
👉ఆపరేషన్ అభ్యాస్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
👉జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో మరికాసేపట్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నాం
👉సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అలర్ట్ చేస్తాం.
👉4 గంటలకు సైరన్ మోగగానే మాక్ డ్రిల్ ప్రారంభమవుతుంది.
👉హైదరాబాద్, విశాఖ సహా 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్
👉ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్ నిర్వహణ
👉సాయంత్రం 4 గంటల నుంచి 4.30 వరకు మాక్ డ్రిల్
👉హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్
👉సికింద్రాబాద్, గోల్గొండ,కంచబాగ్ డీఆర్‌డీఏ, మౌలాలీలోని ఎన్‌ఎఫ్‌సీలో డిఫెన్స్ బృందాల మాక్ డ్రిల్
👉మోగనున్న పోలీస్ సైరన్, ఇండస్ట్రియల్ సైరన్లు