
వాషింగ్టన్: ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడికి, ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ) సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్ తన అస్తిత్వానికి పాక్ ముప్పుగా భావిస్తుందని, అందుకే దాయాది దేశం తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తుందనేది డీఐఏ నివేదిక సారాంశం.
2025 worldwide threat assessment report పేరుతో డీఐఏ రిపోర్టును విడుదల చేసింది. అందులో భారత్‌ను ఇప్పటికీ పాక్ తన అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. భారత సైనిక శక్తిని దృష్టిలో ఉంచుకొని.. అణ్వాయుధాల అభివృద్ధి సహా సైనిక ఆధునీకరణ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
ఇందులో భాగంగా పాక్ విదేశీ సరఫరాదారుల, మధ్యవర్తుల ద్వారా భారీ విధ్వంసాలను సృష్టించే పదార్థాలను weapons of mass destruction (WMDs) సంపాదిస్తుందని, ఆ అణు పదార్ధాలతో పాటు, అందుకు కావాల్సిన సాంకేతికతను చైనా నుండి పొందుతుందని తెలిపింది. వీటి ట్రాన్స్‌ఫర్ హాంకాంగ్, సింగపూర్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల ద్వారా జరుగుతోందని హైలెట్ చేసింది.
భారత్‌పై అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక
డీఏఐ తన నివేదికలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్.. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై క్షిపణులతో దాడిచేసింది. మే 7 నుండి 10 వరకు రెండు దేశాలూ క్షిపణులు, డ్రోన్లు, ఇతర ఆయుధాలతో పరస్పర దాడులకు పాల్పడ్డాయి. మే 10 నాటికి రెండు సైనిక బలగాలు పూర్తి కాల్పుల విరమణపై అంగీకరించాయి’ అని డీఐఏ తన నివేదికలు తెలిపింది.