
పహల్గామ్ ఉగ్రదాడి అనేక కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపిండి. తాజాగా BSF కానిస్టేబుల్ రాంబాబు సింగ్ అసువులు బాశాడు. మే 9, 2025న ఇండో-పాక్ సరిహద్దులో తన ధైర్య సైనికుల సోదరులతో కలిసి పోరాడుతున్న క్రమంలో జమ్మూ కాశ్మీర్‌లో ప్రత్యర్థుల కాల్పులకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతను మే 13న తుదిశ్వాస విడిచాడు. దీంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగి పోయింది.
నాలుగు నెలల క్రితం వివాహం
బోర్డర్ సెక్యూరిటీ దళానికి చెందిన రాంబాబు సింగ్ బీహార్‌లోని సివాన్ జిల్లాకు చెందినవాడు. ఏప్రిల్ 22న జరిగినపహల్గామ్ దాడి, 26 మంది అమాయకుల చనిపోయిన తరువాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో పోరాడుతూ అమరుడైనాడు. రాంబాబు మృతదేహాన్ని మే 14, 2025న అతని గ్రామం వాసిల్‌పూర్‌కు తీసుకువచ్చారు. గ్రామస్తులందరూ అమరసైనికుడికి కన్నీటి నివాళులర్పించారు. ఆర్మీ అధికారులు , జిల్లా అధికారుల అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆర్‌జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా వీర జవాన్‌కు నివాళులర్పించారు.
#WATCH | Siwan, Bihar | Mortal remains of BSF Jawan Rambabu Singh, who lost his life in the line of duty due to cross-border shelling from Pakistan, brought to his native village in Siwan. pic.twitter.com/iShgQ0J1Dh
— ANI (@ANI) May 14, 2025
#WATCH | Patna, Bihar | Mortal remains of BSF Jawan Rambabu Singh, who lost his life in the line of duty due to cross-border shelling from Pakistan, brought to Patna.
RJD leader Tejashwi Yadav pays tribute to him. pic.twitter.com/RBGOMOUNF2— ANI (@ANI) May 14, 2025
ఆపరేషన్ సిందూర్‌లో
రాంబాబు సింగ్ ముందు వరుసలో నిలబడి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. చిన్నప్పటినుంచీ దేశానికి సేవ చేయాలనేకోరికతో సైనికుడిగా బాధ్యతల్లో చేరాడు. ఆ జవాన్ నాలుగు నెలల క్రితం (2025, ఫిబ్రవరి) వివాహమైంది. ఆ తర్వాత వివాదాస్పద ప్రాంతానికి బదిలీ అయ్యాడు. దేశంకోసం పోరాడుతూ ప్రాణాలర్పించిన అమరవీరుడి మరణ వార్త రాంబాబు సింగ్ గ్రామం మొత్తాన్ని దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురిచేసింది. తన భర్త మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందిని, కానీ చాలా గర్వంగా ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవలే రాంబాబు తండ్రి మరణించారు.
ఇదీ చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?
రాంబాబు సింగ్ త్యాగాన్ని దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది అంటూ జవాను మరణంపైబీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అమరవీరుడి బంధువులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
చదవండి: లగ్గం..షరతుల పగ్గం! పెళ్లికాని ప్రసాదుల కష్టాలు ఇంతింత కాదయా!
పహల్గామ్ దాడి , 'ఆపరేషన్ సిందూర్'
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్‌లో అమాయక పౌరులపై గుర్తు తెలియని ముష్కరులు కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ దాడికి ప్రతిస్పందనగా, మే 7, 2025 తెల్లవారుజామున రక్షణ మంత్రిత్వ శాఖ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేసింది.