
ఏపీలో కూటమి ప్రభుత్వ ఆగడాలు కొనసాగుతున్నాయి. కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ గుండాలు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రినగర్ లో ఆయన ఇంటిపై 60-70 మంది దాడి చేశారు.

ఇంట్లో ఫర్నిచర్ తో పాటు కారును పూర్తిగా ధ్వంసం చేశారు. జిల్లా చరిత్రలో ఇలాంటి దాడులు ఎప్పుడూ చూడలేదని.. ప్రసన్న కుమార్ నిజాలు మాట్లాడితే జీర్ణించుకోలేని టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
























