
బిహార్‌లోని ఓ ఆస్పత్రిలో 12 మందికి అదే పేరు
కతిహార్: పహల్గాం ఉగ్రదాడిలో మరణించినవారికి నివాళిగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను యావత్ భారతం స్వాగతించింది. అయితే.. ఆ పేరుపై ట్రేడ్‌మార్క్ కోసం వ్యాపారవేత్తలు పోటీ పడుతుంటే.. ప్రజలు మాత్రం ఆ ఆపరేషన్‌ను మరింత గుర్తుండిపోయేలా చేసుకుంటున్నారు. పాక్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపిన
బుధవారం రోజే పుట్టిన తమ బిడ్డలకు ఆపరేషన్ పేరు పెట్టుకుంటున్నారు. అమ్మాయిలయితే సిందూరి అని, అబ్బాయికయితే సిందూర్ అని పేరు పెట్టుకుంటున్నారు. బిహార్‌లో ఉన్న కతిహార్ జిల్లాలోని ఓ చిన్న ఆసుపత్రిలో కుందన్ కుమార్ మండల్ తన కూతురుకు సిందూరి పేరు పెట్టాడు.
భారత సాయుధ దళాల ఆపరేషన్ పట్ల సంతోషం వ్యక్తం చేసిన కుందన్.. ఆ పేరు తన కూతురుకు పెట్టుకోవడం గర్వంగా ఉందన్నారు. ఒక్క కుందన్‌మాత్రమే కాదు.. ఆ పేరు పెట్టినందుకు కుటుంబమంతా సంతోషంగా ఉంది. ఆసుపత్రి సిబ్బంది కూడా ఈ పేరును ఆమోదించారు. పెరిగి పెద్దయ్యాక అమ్మాయి తన పేరు వెనుక ఉన్న ప్రాముఖ్యతను, చరిత్రను తెలుసుకుంటుందని కుటుంబం ఆశిస్తోంది. ఒక్క కుందన్ మాత్రమే కాదు.. బిహార్‌లోని ఓ ఆస్పత్రిలో 12 మంది ఈ పేరు పెట్టుకున్నారు.
‘ఆపరేషన్ సిందూర్’జరిపిన రోజు పుట్టిన 12 మంది పిల్లలకు ముజఫర్‌పూర్‌లో ఈ పేరే పెట్టుకున్నారు. రెండు ఆనందాలు కలిసి వచ్చాయని సంబరపడిపోతున్నారు. పెద్దయ్యాక తమ పిల్లలను సైన్యంలో చేరి్పస్తామని అంటున్నారు. కన్హారా నివాసి హిమాన్షు రాజ్ కూడా తన కూతురికి ‘సిందూరి’అని నామకరణం చేశాడు. ‘సిందూరి’పేరు కుటుంబానికి గర్వకారణంగా మారింది. జాఫర్‌పూర్‌కు చెందిన పవన్ సోనీతన కొడుకుకి సిందూర్ అని పేరు పెట్టాడు. ‘సిందూర్’కేవలం పేరు కాదు.. అదొక గర్వమని చెబుతున్నారు.