Childrens names
-
పిల్లలకు సిందూర్ పేరు
కతిహార్: పహల్గాం ఉగ్రదాడిలో మరణించినవారికి నివాళిగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను యావత్ భారతం స్వాగతించింది. అయితే.. ఆ పేరుపై ట్రేడ్‌మార్క్ కోసం వ్యాపారవేత్తలు పోటీ పడుతుంటే.. ప్రజలు మాత్రం ఆ ఆపరేషన్‌ను మరింత గుర్తుండిపోయేలా చేసుకుంటున్నారు. పాక్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపిన బుధవారం రోజే పుట్టిన తమ బిడ్డలకు ఆపరేషన్ పేరు పెట్టుకుంటున్నారు. అమ్మాయిలయితే సిందూరి అని, అబ్బాయికయితే సిందూర్ అని పేరు పెట్టుకుంటున్నారు. బిహార్‌లో ఉన్న కతిహార్ జిల్లాలోని ఓ చిన్న ఆసుపత్రిలో కుందన్ కుమార్ మండల్ తన కూతురుకు సిందూరి పేరు పెట్టాడు. భారత సాయుధ దళాల ఆపరేషన్ పట్ల సంతోషం వ్యక్తం చేసిన కుందన్.. ఆ పేరు తన కూతురుకు పెట్టుకోవడం గర్వంగా ఉందన్నారు. ఒక్క కుందన్మాత్రమే కాదు.. ఆ పేరు పెట్టినందుకు కుటుంబమంతా సంతోషంగా ఉంది. ఆసుపత్రి సిబ్బంది కూడా ఈ పేరును ఆమోదించారు. పెరిగి పెద్దయ్యాక అమ్మాయి తన పేరు వెనుక ఉన్న ప్రాముఖ్యతను, చరిత్రను తెలుసుకుంటుందని కుటుంబం ఆశిస్తోంది. ఒక్క కుందన్ మాత్రమే కాదు.. బిహార్‌లోని ఓ ఆస్పత్రిలో 12 మంది ఈ పేరు పెట్టుకున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’జరిపిన రోజు పుట్టిన 12 మంది పిల్లలకు ముజఫర్‌పూర్‌లో ఈ పేరే పెట్టుకున్నారు. రెండు ఆనందాలు కలిసి వచ్చాయని సంబరపడిపోతున్నారు. పెద్దయ్యాక తమ పిల్లలను సైన్యంలో చేరి్పస్తామని అంటున్నారు. కన్హారా నివాసి హిమాన్షు రాజ్ కూడా తన కూతురికి ‘సిందూరి’అని నామకరణం చేశాడు. ‘సిందూరి’పేరు కుటుంబానికి గర్వకారణంగా మారింది. జాఫర్పూర్కు చెందిన పవన్ సోనీతన కొడుకుకి సిందూర్ అని పేరు పెట్టాడు. ‘సిందూర్’కేవలం పేరు కాదు.. అదొక గర్వమని చెబుతున్నారు. -
పిల్లలకూ పెన్షన్!
న్యూఢిల్లీ: పిల్లల పేరిట పింఛను పథకం ప్రారంభించి, ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా ‘ఎన్పీఎస్ వాత్సల్య’ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ పథకాన్ని 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఎన్పీఎస్ పథకం మెరుగైన రాబడులను అందిస్తోందని, భవిష్యత్ ఆదాయం కోసం ఇందులో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కలి్పస్తున్నట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ విభాగంలో 14 శాతం, కార్పొరేట్ డెట్‌లో 9.1 శాతం, జీ–సెక్లలో 8.8 శాతం చొప్పున రాబడులు ఉన్నట్టు వివరించారు. ‘పీఎం వాత్సల్య పథకాన్ని అమలు చేసే క్రమంలో దీన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటాం’అని ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ సరీ్వసెస్ విభాగం కార్యదర్శి నాగరాజు మద్దిరాల తెలిపారు. ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు..? ఆన్లైన్లో లేదంటే ఆఫ్‌లైన్‌లో బ్యాంక్ శాఖ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి రూ.1,000తో ఎన్పీఎస్ వాత్సల్య పథకం ప్రారంభించొచ్చు. ఆ తర్వాత నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు పిల్లల పేరుమీద ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వెంటనే వారి పేరు మీద రెగ్యులర్ ఎన్పీఎస్ ఖాతాగా అది మారుతుంది. వారికి 60 ఏళ్లు నిండే వరకు కొనసాగుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇప్పటికే ఎన్పీఎస్ వాత్సల్య ప్రారంభించేందుకు పీఎఫ్ఆర్డీఏతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ముంబైలో ఈ పథకాన్ని ప్రారంభించి, కొందరు పిల్లలను పేరిట ఖాతాలు తెరిపించింది. పిల్లల పేరిట ఈ ఖాతాను ప్రారంభించడం ద్వారా వారి భవిష్యత్తుకు తల్లిదండ్రులు భరోసా కల్పించినట్టు అవుతుంది. పెట్టుబడి దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రభావంతో మంచి సంపదగా మారుతుంది. -
పెద్ద మనసున్నవాడు... దేవుడు పంపినవాడు!
పిల్లలకు పేర్లు పెట్టడంలో సగటు మనుషులైనా, సెలబ్రిటీలైనా ఒకే విధంగా ఆలోచిస్తారు. క్రియేటివ్‌గా ఉండాలని, అలాగే మంచి అర్థం కూడా ఉండాలని. బాలీవుడ్ తారలు కొందరు ఇటీవల, లేదా కొంతకాలం క్రితం తమ పిల్లకు భలే వెరైటీ పేర్లను పెట్టారు. వాటిని, వాటి అర్థాలను ఒకసారి చూద్దాం. రాణీముఖర్జీ కూతురు అదీరా. అరబ్‌లో అదీరా అంటే స్ట్రాంగ్, పవర్ఫుల్, నోబుల్ అని. జెనీలియా కొడుకు రియాన్. లిటిల్ కింగ్ అని అర్థం అట. ఇలాంటి పేరే వియాన్. శిల్పాశెట్టి కొడుకు వియాన్. ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ ఎనర్జీ అని ఈ పేరుకు అర్థం. ఇమ్రాన్, అవంతికల కూతురు ఇమారా. అంటే స్ట్రాంగ్ అండ్ రిజల్యూట్ అని. ఐశ్వర్య కూతురు పేరు తెలిసిందే. ఆరాధ్య. ఆరాధ్యకు అర్థమూ తెలిసిందే. ఆరాధించదగిన అని. ఆమిర్ ఖాన్ అద్దెగర్భం ద్వారా తెచ్చుకున్న కొడుకు ఆజాద్. స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అజాద్ పేరు పెట్టుకున్నారు ఆమిర్ తన కొడుక్కి. ఆజాద్ అంటే స్వేచ్ఛ, విముక్తి అని అర్థం. హృతిక్ రోషన్ తనయులు హృదాన్, హ్రెహాన్. ఇవి రెండూ అరబ్ పేర్లు. పెద్ద మనసున్న వాడు హృదాన్. దేవుడు ఎంపిక చేసి పంపినవాడు హ్రెహాన్. షారుక్‌ఖాన్‌కి ముగ్గురు పిల్లలు. ఆర్యన్, అమ్మాయి సుహానా, అబ్రామ్. ఆర్యన్ అంటే యుద్ధయోధుడు, సుహానా అంటే అందమైన అని. ప్రవక్త అబ్రహాం, శ్రీరాముడిలో రామ్ ఇద్దరి పేర్లు కలిపి కొడుక్కి అబ్రామ్ అని పెట్టుకున్నారు షారుక్ దంపతులు. అక్షయ్ కుమార్‌కి ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఆరవ్ (పీస్ఫుల్), అమ్మాయి నిటారా (బలమైన పునాదులు కలిగినది). కాజోల్ కూతురు నైసా. గ్రీకులో ఈ మాటకు ‘గోల్’ అని అర్థం. కాజోల్‌కి ఈ మధ్య పుట్టినవాడి పేరు యుగ్. తెలిసిందే. యుగం అని. మాధురీ దీక్షిత్‌కు ఇద్దరు కొడుకులు రాయన్, ఆరిన్. రాయన్ అంటే స్వర్గం. ఆరిన్ అంటే శక్తి పర్వతం. సుస్మితాసేన్ దత్తపుత్రికలు రెనీ, అలీసా. మళ్లీ పుట్టబోతున్నదీ, పవిత్రమైనదీ అని. సంజయ్‌దత్ కొడుకు, కూతురు షారాన్, ఇక్రా. యోధుడు, నేర్చుకోవలసినవాడు అని ఈ రెండు పేర్ల భావం. ఇంకా చాలా చాలా పేర్లు వెరైటీ వెరైటీగా ఉంటాయి. అందుకే బాలీవుడ్ న్యూస్ ఫాలో అవుతుండండి.