
మట్టిలో పుట్టిన మాణిక్యాలకు మన దేశంలో కొదువ లేదు. చిన్న వయసులోనే అత్యద్బుతమైన నైపుణ్యంతో అబ్బుర పరచడమే కాదు, అరుదైన ఘనతను సొంతం చేసుకుంటారు. అలాంటి రత్నం లాంటి వ్యక్తి గురించి తెలుసుకుందామా.
మహా మహా నిపుణులే కనిపెట్టలేని బగ్‌ను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు తన పొరుగువారి Wi-Fi ని హ్యాక్ చేసి దానితో ఆడుకునే ఆ పిల్లవాడు, నేడు NASA వంటి ప్రపంచంలోని అతిపెద్ద అంతరిక్ష సంస్థ వెబ్‌సైట్‌ను సైబర్ దాడుల నుండి రక్షించాడు కాన్పూర్‌కు చెందిన యువరాజ్ గుప్తా (Yuvraj Gupta). తన సామర్థ్యాలతో ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు.
ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థి యువరాజ్ గుప్తానేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) వెబ్‌సైట్‌లో తీవ్రమైన భద్రతా లోపాన్ని కనుగొన్నాడు. ఈ బగ్ ద్వారా, ఎవరైనా NASA అధికారిక ఇమెయిల్ నుండి నకిలీ సందేశాలను పంపవచ్చు. ఎంతోమంది సైబర్ నిపుణులు ఈ లోపాన్ని పట్టుకోలేకపోయారు, కానీ యువరాజ్ దాన్ని గుర్తించడం విశేషంగా నిలిచింది.
BREAKING NEWS 🚨 📢
14 year old Yuvraj Gupta, who lives in Kanpur, Uttar Pradesh, has done a great feat. Hesaved the website of American space agency NASA from hackers.
NASA has included him in the 'Hall of Fame' and also given him a letter of recognition. pic.twitter.com/GzTbgFB8GN— News Arena India (@NewsArenaIndia) May 25, 2025
fy"> NASA బగ్ బౌంటీ కార్యక్రమంలో దాదాపు రెండు వారాల పాటుప్రయత్నించిన , ఇక ఆశ వదిలేసుకుంటున్న సమయంలో ఒక రాత్రి అతను NASA సబ్ డొమైన్‌లో లోపాన్ని కనుగొన్నాడు. దీనిపై సమగ్ర నివేదికను తయారు చేసి వీడియోతో పాటు నాసాకు పంపించాడు. ఇది మాత్రమే కాదు, అతను నకిలీ ఈమెయిల్స్, రహస్య సమాచారాన్ని చేరవేసే బగ్‌ల గురించి తెలియజేశాడు. యువరాజ్ గుప్తా సాధించిన ఈ ఘనతకు నాసా గుర్తించింది. యువరాజ్‌ను ప్రశంసా పత్రం , 'హాల్ ఆఫ్ ఫేమ్'లో స్థానం కల్పించి సత్కరించింది.
కాన్పూర్‌లోని సరస్వతి విద్యా మందిర్ ఇంటర్ కాలేజీ (దామోదర్ నగర్)లో చదువుతున్నాడు . 10వ తరగతిలో 79.4 శాతం మార్కులు సాధించాడు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ, అతను యూట్యూబ్, ఆన్‌లైన్ కోర్సులు, పుస్తకాల ద్వారా ఎథికల్ హ్యాకింగ్‌పై పట్టు సాధించాడు. 6వ తరగతిలో ఉన్నప్పటినుంచీ సైబర్ సెక్యూరిటీపై ఆసక్తి పెంచుకున్నాడు. పట్టువదలకుండా ఎథికల్ హ్యాకింగ్‌లో నైపుణ్యాన్ని సాధించాడు. తాజాగా తన నైపుణ్యంతో నాసాను ఇంప్రెస్ చేయడం విశేషం.
యువరాజ్ గుప్తా తండ్రి జై నారాయణ్ గుప్తా ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. తల్లి కల్పనా గుప్తా గృహిణి. యువరాజ్ కు ల్యాప్ టాప్ ఇవ్వడానికి, అతని సోదరి స్కాలర్‌షిప్ , అతని తండ్రి పొదుపు మొత్తాన్ని కలిపి మొత్తం సిస్టంను సమకూర్చుకున్నాడట. దేశానికి డిజిటల్ భద్రతను అందించాలనే సంకల్పంతో ఉన్నామంటోంది యువరాజ్ కుటుంబం.