
తిరిగి ఇవ్వకపోతే లావైపోతాం
నాణ్యమైన విద్య దేశ అభివృద్ధికి బాటలు వేస్తుంది. "పఢేగా ఇండియా తభీ తో బడేగా ఇండియా" అన్నట్టు 136 కోట్లకు పైగా జనాభా ఉన్న ప్రజాస్వామ్య దేశంలో విద్య ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. గతంలో అనేకమంది సంఘ సంస్కర్తలు, పాలకులు నాణ్యమైన విద్యకోసం సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యాలయాల కోసం, గ్రామీణభారతంలో విద్యాభివృద్ధికోసం ఎన్నో గుప్త దానాలు చేశారు. తాజాగా రాజస్థాన్‌లోని శిశోద అనే గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు వార్తల్లో నిలిచారు. గ్రామీణ పిల్లలకు తమ గ్రామంలో ప్రపంచస్థాయి విద్యను అందించేందుకు కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.
రాజస్థాన్ సోదరుల దాతృత్వం
రాజస్థాన్‌కు చెందిన సోదరులు మేఘరాజ్-అజిత్ నగరాలకు పరిమితమైన ఉత్తమ విద్యను తమ గ్రామంలోని విద్యార్థులకు కూడా అందాలని కలగన్నారు. ఈ లక్ష్యంతోనే తమ గ్రామంలోని స్కూలు అభివృద్ధికోసం ఏకంగా 15 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. కంకుబాయి-సోహన్‌లాల్ ధకాడ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్‌ను అత్యాధునికంగా తయారు చేశారు. ఆధునిక ప్రయోగశాలలు , సకల హంగులతో తరగతి గదులు, భారతదేశంలోని టాప్ ప్రైవేట్ పాఠశాలలతో ధీటుగా తీర్చిదిద్దారు.
తమ గ్రామంలో పిల్లలకు ‘అందరికీ విద్య హక్కు’ నినాదానికి అనుగుణంగా చక్కటి వాతావరణాన్ని సృష్టించారు. విద్య అనేది కేవలం ధనవంతులకే కాదు.. అందరికీ అని చాటి చెప్పారు. ప్రతి పిల్లవాడు భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటాడని , రాజస్థాన్‌ను గర్వించదగిన రాష్ట్రంగా మలుస్తున్నారని వీరు నమ్ముతున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ స్కూలు ప్రారంభోత్సవ వేడుకు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పలువురి నెటిజనులను ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి: చెఫ్‌ల వైట్ క్యాప్ వెనుక రహస్యం? వీటికీ ర్యాంకులుంటాయా?
వీరి చొరవ కారణంగా రాజస్థాన్‌లోని శిషోడా గ్రామంలో ఉన్న కంకుబాయి-సోహన్‌లాల్ ధకాడ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ ఇపుడు ఆధునిక మూడు అంతస్తుల క్యాంపస్‌లో 40 స్మార్ట్ తరగతి గదులతో అలరారుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ లెర్నింగ్ టూల్స్తో పాటు, విశాలమైన ఆట స్థలంకూడా ఉంది. ప్రతి తల్లిదండ్రులు విద్య ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని మేఘరాజ్, అజిత్ తెలిపారు. తరగతి గదుల వెలుపల కూడా విద్యాబోధన జరిగేలా పుస్తకాలు, పచ్చదనంతో కూడిన చక్కటి లైబ్రరీతో తీర్చిదిద్దామని తెలిపారు.
దీనిపై గ్రామస్తులు సంతోషాన్ని వెలిబుచ్చారు. "ఇప్పుడిక మా పిల్లలను బయటికి పంపాల్సిన అవసరం లేదు. ఇలాంటి పాఠశాల గురించి కలలో కూడా ఊహించలేదు." అంటూ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. మేఘరాజ్ - అజిత్ సోదరులు ఈ స్కూల్‌లోనే చదువుకున్నారు. అందుకే తమకు విద్యను ప్రసాదించిన గ్రామానికి ఏదైనా గొప్పగా ఇవ్వాలని భావించి, స్థానికి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేశారు.