breaking news
exgracia
-
పాతబస్తీ ప్రమాదంపై మోదీ ఆరా.. బాధితులకు రెండు లక్షల పరిహారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చార్మినార్‌కు సమీపంలోని గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన వారికి మోదీ సంతాపం తెలిపారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపాన్ని ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల పరిహారం మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి యాభై వేల రూపాయల సాయాన్ని అందించనున్నట్టు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. మృతుల కుటుంబాలు ఈ ఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించిందని పీఎంవో ట్విట్టర్ వేదికగా పేర్కొంది.Deeply anguished by the loss of lives due to a fire tragedy in Hyderabad, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…— PMO India (@PMOIndia) May 18, 2025సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఇదిలా ఉండగా.. పాతబస్తీలో అగ్ని ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 17 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు.మృతుల వివరాలు..రాజేంద్రకుమార్ (67)అభిషేక్ మోదీ (30)సుమిత్ర (65)మున్నీబాయి (72)ఆరుషి జైన్ (17)శీతల్ జైన్ (37)ఇరాజ్ (2)హర్షాలీ గుప్తా (7)రజని అగర్వాల్‌అన్య మోదీపంకజ్ మోదీవర్ష మోదీఇద్దిక్కి మోదీరిషభ్‌ప్రథమ్ అగర్వాల్‌ప్రాంశు అగర్వాల్. -
దేశానికి సేవ చేయాలని కలగన్నాడు..కానీ, పెళ్లైన నాలుగునాళ్లకే
పహల్గామ్ ఉగ్రదాడి అనేక కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపిండి. తాజాగా BSF కానిస్టేబుల్ రాంబాబు సింగ్ అసువులు బాశాడు. మే 9, 2025న ఇండో-పాక్ సరిహద్దులో తన ధైర్య సైనికుల సోదరులతో కలిసి పోరాడుతున్న క్రమంలో జమ్మూ కాశ్మీర్లో ప్రత్యర్థుల కాల్పులకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతను మే 13న తుదిశ్వాస విడిచాడు. దీంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగి పోయింది.నాలుగు నెలల క్రితం వివాహంబోర్డర్ సెక్యూరిటీ దళానికి చెందిన రాంబాబు సింగ్ బీహార్‌లోని సివాన్ జిల్లాకు చెందినవాడు. ఏప్రిల్ 22న జరిగినపహల్గామ్ దాడి, 26 మంది అమాయకుల చనిపోయిన తరువాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో పోరాడుతూ అమరుడైనాడు. రాంబాబు మృతదేహాన్ని మే 14, 2025న అతని గ్రామం వాసిల్పూర్కు తీసుకువచ్చారు. గ్రామస్తులందరూ అమరసైనికుడికి కన్నీటి నివాళులర్పించారు. ఆర్మీ అధికారులు , జిల్లా అధికారుల అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా వీర జవాన్‌కు నివాళులర్పించారు.#WATCH | Siwan, Bihar | Mortal remains of BSF Jawan Rambabu Singh, who lost his life in the line of duty due to cross-border shelling from Pakistan, brought to his native village in Siwan. pic.twitter.com/iShgQ0J1Dh— ANI (@ANI) May 14, 2025 #WATCH | Patna, Bihar | Mortal remains of BSF Jawan Rambabu Singh, who lost his life in the line of duty due to cross-border shelling from Pakistan, brought to Patna.RJD leader Tejashwi Yadav pays tribute to him. pic.twitter.com/RBGOMOUNF2— ANI (@ANI) May 14, 2025ఆపరేషన్ సిందూర్లోరాంబాబు సింగ్ ముందు వరుసలో నిలబడి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. చిన్నప్పటినుంచీ దేశానికి సేవ చేయాలనేకోరికతో సైనికుడిగా బాధ్యతల్లో చేరాడు. ఆ జవాన్ నాలుగు నెలల క్రితం (2025, ఫిబ్రవరి) వివాహమైంది. ఆ తర్వాత వివాదాస్పద ప్రాంతానికి బదిలీ అయ్యాడు. దేశంకోసం పోరాడుతూ ప్రాణాలర్పించిన అమరవీరుడి మరణ వార్త రాంబాబు సింగ్ గ్రామం మొత్తాన్ని దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురిచేసింది. తన భర్త మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందిని, కానీ చాలా గర్వంగా ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవలే రాంబాబు తండ్రి మరణించారు. ఇదీ చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?రాంబాబు సింగ్ త్యాగాన్ని దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది అంటూ జవాను మరణంపైబీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అమరవీరుడి బంధువులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.చదవండి: లగ్గం..షరతుల పగ్గం! పెళ్లికాని ప్రసాదుల కష్టాలు ఇంతింత కాదయా!పహల్గామ్ దాడి , 'ఆపరేషన్ సిందూర్'జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లోని బైసరన్‌లో అమాయక పౌరులపై గుర్తు తెలియని ముష్కరులు కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ దాడికి ప్రతిస్పందనగా, మే 7, 2025 తెల్లవారుజామున రక్షణ మంత్రిత్వ శాఖ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేసింది. -
గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు -
ఏపీలో బాధిత కుటుంబాలకు 10 లక్షల సాయం: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో మహిళల భద్రతలను కూటమి నేతలు ప్రశ్నార్థకంగా మార్చేశారని అన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. అన్ని వర్గాల మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రతీ బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు వైఎస్ జగన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధితు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని హితవు పలికారు.గుంటూరు జీజీహెచ్‌లో సహానా కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. అనంతరం ఆసుపత్రి వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ తరఫున బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. ప్రతీ బాధిత ఆరు కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి ప్రతీ కుటుంబాన్ని ఆదుకోవాలి. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు భద్రత లేదు. దీనిపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.ప్రతిపక్షంలో ఉన్న మేమే బాధిత కుటుంబాలను ఆదుకుంటున్నాం. ప్రభుత్వంలో ఉన్న మీరు ఏం చేస్తారో.. ఎంత సాయం అందిస్తారో చూస్తాం. దళితులంతా నా వాళ్లే.. వారికి అండగా ఉంటాను. పేదల పక్షాన ఎంత దూరమైనా పోరాడతాను. వచ్చేది మన ప్రభుత్వమే. నిందితులను వెంటాడి జైల్లో పెడతాం. మన ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుంది అని హామీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: కళ్ల ఎదుటే సాక్షాలు కనిపిస్తున్నా.. శిక్ష ఎందుకు లేదు?: వైఎస్ జగన్ -
వయనాడ్ విపత్తు: స్పందించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పాడిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 19 మంది మృతిచెందారు. మృతుల్లో ఒక చిన్నారి, ఒక విదేశీయుడు ఉన్నారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి మోదీ స్పందిచారు. ‘వయనాడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం బాధ కలిగించింది. ఈ ఘటనలో గాయపడిన వారి కోసం ప్రార్థనలు చేస్తున్నా. బాధితులకు సహాయం చేయడానికి ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్‌తో మాట్లాడాను. ఆయన అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.PM Narendra Modi tweets, "Distressed the landslides in parts of Wayanad. My thoughts are with all those who have lost their loved ones and prayers with those injured. Rescue ops are currently underway to assist all those affected. Spoke to Kerala CM Pinarayi Vijayan and also… pic.twitter.com/y12areB2mw— ANI (@ANI) July 30, 2024 అదే విధంగా వయనాడ్ విపత్తులో మరణించినవారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారికి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.Prime Minister announced an ex-gratia of Rs. 2 lakhs from PMNRF for the next of kin of each deceased in the landslides in parts of Wayanad. The injured would be given Rs. 50,000. pic.twitter.com/iDy1Kgaqv2— ANI (@ANI) July 30, 2024కేరళ సీఎంతో ఫోన్లో మాట్లాడిన రాహుల్ గాంధీవాయనాడ్లోని మెప్పాడి సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనపై మాజీ వయనాడ్ మాజీ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పందించారు. ‘‘కొండచరియలు విరగినపడిన ఘటన తెలిసి చాలా బాధపడ్డాను. కేరళ ముఖ్యమంత్రి, వయనాడ్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాను. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని హామీ ఇచ్చారు. అన్ని ఏజెన్సీలతో సమన్వయం ఉండేలా చూసుకోవాలని, కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని కోరాను. సహాయక చర్యలకు అవసరమైన ఏదైనా సహాయం గురించి మాకు తెలియజేయాలని వారికి విజ్ఞప్తి చేశాను. అదేవిధంగా కేంద్ర మంత్రులతో మాట్లాడి వాయనాడ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తాను. సహాయక చర్యల్లో యూడీఎఫ్ కార్యకర్తలందరూ పాల్గొనాలని కోరుతున్నాను’’ అని ఎక్స్‌లో తెలిపారు.Wayanad landslide | Lok Sabha LoP and former MP from Wayanad, Rahul Gandhi tweets, "I am deeply anguished by the massive landslides near Meppadi in Wayanad...I have spoken to the Kerala Chief Minister and the Wayanad District Collector, who assured me that rescue operations are… pic.twitter.com/qqu7VLH4XN— ANI (@ANI) July 30, 2024 -
మహారాష్ట్ర బస్సు ప్రమాదం.. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు
ముంబై: శనివారం తెల్లవారు జామున సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ హైవే మీద ఒక ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో మొతం 33 మంది ప్రయాణిస్తుండగా వారిలో 26 మంది మృతి చెందగా 7 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. హైవే మీద వెళ్తుండగా అకస్మాత్తుగా బస్సు టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు బుల్దానా ఎస్పీ సునీల్ కందసానే. గాయపడిన వారిని బుల్దానాలోని సివిల్ హాస్పిటల్‌కు తరలించినట్టు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యావత్మాల్ నుండి పూణే వెళ్తున్న బస్సు బుల్దానా జిల్లాలోకి ప్రవేశించగానే భారీ శబ్దం చేస్తూ బస్సు టైర్ ఒకటి పేలిపోయింది. దాంతో అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి పక్కకు పడిపోయింది. వెంటనే డీజిల్ ట్యాంక్ నుండి అగ్నికీలలు ఎగసి క్షణాల్లో బస్సు మొత్తాన్ని ఆవహించేశాయి. ప్రయాణికులంతా గాఢమైన నిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో వారికి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. బుల్దానాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుంటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారులుబాధితులకు సాధ్యమైన సహాయాన్ని అందిస్తోందన్నారు. ప్రమాదంలో మరణించవారి కుటుంబ సభ్యులకు రూ. 2లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50 వేలు అందించనున్నట్లు తెలిపారు. Deeply saddened by the devastating bus mishap in Buldhana, Maharashtra. My thoughts and prayers are with the families of those who lost their lives. May the injured recover soon. The local administration is providing all possible assistance to the affected: PM @narendramodi — PMO India (@PMOIndia) July 1, 2023 అయితే తెల్లవారుతూనే వెలుగులోకి వచ్చిన ఈ వార్త గురించి తెలియగానే రహదారి నిర్మాణంపైనా, భద్రత పైనా చర్చ లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలకు స్పందిస్తూ.. ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం నాణ్యత గురించి ప్రస్తావించడానికి ఇది సందర్భం కాదు. మృతుల కుటుంబాలను ఆదుకోవడమే తమ తక్షణ కర్తవ్యమని అన్నారు. ఈ ప్రమాదంలో 26 మంది చనిపోయారు, ఏడుగురు గాయపడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, మృతుల వివరాలు తెలియకుంటే డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. డెప్యూటీ సీఎం. ప్రమాదం మానవతప్పిదం వలన జరిగిందా? లేక సాంకేతిక లోపం వలన జరిగిందా అన్నది విచారణలో తెలుస్తుందన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని, వీలయితే స్మార్ట్ సిస్టమ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 5 లక్షలు నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు ఫడ్నవీస్. కేంద్రం కూడా ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇది కూడా చదవండి: రైల్వే పోలీసు అమానుషం.. నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోసి.. -
సైనికుల త్యాగాలకు వెలకట్టలేం : చంద్రబాబు
సాక్షి, అమరావతి : పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి.. మన కుటుంబాల కోసం పాటుపడుతున్న సైనికుల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరకుండా కేంద్ర, రాష్ట్రాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాలని సీఎం సూచించారు. అమరుల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఒక్కో అమర జవాన్ కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున సహాయం ప్రకటిస్తున్నామని సీఎం తెలిపారు. -
వర్ష బాధితులను ఆదుకుంటాం
♦ మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ♦ గాయపడిన వారికి రూ. 50 వేలు ♦ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ యాకుత్‌పురా: ఈదురు గాలులు, వర్షం కారణంగా మరణించిన కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా అందజేసి ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. శనివారం ఆయన డిప్యూటీ మేయర్ మహ్మద్ ఫసియుద్దీన్, చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, జీహెచ్ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్ ఆర్డీఓ నిఖిలతో కలిసి ఈదురు గాలుల కారణంగా మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను, దేవాలయాన్ని సందర్శించారు. మొదట గౌలిపురా సుల్తాన్షాహి, జగదీష్ హనుమాన్ దేవాలయంలో కూలిన చెట్టును పరిశీలించారు. అవసరమైన సహాయక చర్యలు అందిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి తలాబ్‌కట్టా జహంగీర్‌నగర్‌లో ఈదురు గాలులకు శుక్రవారం సాయంత్రం సింథటిక్ వాటర్ ట్యాంక్ పడి మృతిచెందిన అహ్మద్ బిన్ ఇబ్రహీం కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహ్మద్ బిన్ ఇబ్రహీం కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందజేసి మృతుడి భార్యకు రెసిడెన్షియల్ పాఠశాలలో ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇదే సంఘటనలో గాయపడిన ఖలీల్ బిన్ ఇబ్రహీం, షరీఫా బేగంలకు రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. మృతుడి భార్యకు రూ.5 లక్షలు వచ్చేంత వరకు ఖర్చుల నిమిత్తం రూ. 25 వేలను అందజేస్తామన్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్-4ఎ,బీ, సర్కిల్-5 బి. కృష్ణశేఖర్, వి.విజయ్ కుమార్, డాక్టర్ ఎన్.యాదగిరిరావు, జీహెచ్ఎంసీ దక్షిణ మండలం బయోడైవర్సిటీ అడిషనల్ డెరైక్టర్ అన్నపూర్ణాదేవి, చార్మినార్, బండ్లగూడ మండల తహసీల్దార్లు ఎస్.పి.ఆర్.మల్లేష్ కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.