ఏపీలో బాధిత కుటుంబాలకు 10 లక్షల సాయం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Ex Gratia Announce To Victim families In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో బాధిత కుటుంబాలకు 10 లక్షల సాయం: వైఎస్‌ జగన్‌

Oct 23 2024 12:34 PM | Updated on Oct 23 2024 1:16 PM

YS Jagan Ex Gratia Announce To Victim families In AP

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో మహిళల భద్రతలను కూటమి నేతలు ప్రశ్నార్థకంగా మార్చేశారని అన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. అన్ని వర్గాల మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రతీ బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు వైఎస్‌ జగన్‌ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధితు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని హితవు పలికారు.

గుంటూరు జీజీహెచ్‌లో సహానా కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. అనంతరం ఆసుపత్రి వద్ద వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ తరఫున బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. ప్రతీ బాధిత ఆరు కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి ప్రతీ కుటుంబాన్ని ఆదుకోవాలి. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు భద్రత లేదు. దీనిపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.

ప్రతిపక్షంలో ఉన్న మేమే బాధిత కుటుంబాలను ఆదుకుంటున్నాం. ప్రభుత్వంలో ఉన్న మీరు ఏం చేస్తారో.. ఎంత సాయం అందిస్తారో చూస్తాం. దళితులంతా నా వాళ్లే.. వారికి అండగా ఉంటాను. పేదల పక్షాన ఎంత దూరమైనా పోరాడతాను. వచ్చేది మన ప్రభుత్వమే. నిందితులను వెంటాడి జైల్లో పెడతాం. మన ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుంది అని హామీ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: కళ్ల ఎదుటే సాక్షాలు కనిపిస్తున్నా.. శిక్ష ఎందుకు లేదు?: వైఎస్‌ జగన్‌
 

Advertisement
 
Advertisement
Advertisement