హ్యాపీ దివాళీ, హ్యాపీ మిడ్‌ నైట్‌ సన్‌రైజ్‌.. పాకిస్తాన్‌పై ఫన్నీ కామెంట్స్‌ | Social Media Funny Comments On Pakistan Over Operation Sindoor | Sakshi
Sakshi News home page

హ్యాపీ దివాళీ, హ్యాపీ మిడ్‌ నైట్‌ సన్‌రైజ్‌.. పాకిస్తాన్‌పై ఫన్నీ కామెంట్స్‌

May 7 2025 11:05 AM | Updated on May 7 2025 12:53 PM

Social Media Funny Comments On Pakistan Over Operation Sindoor

పహల్గాం దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో దాదాపు 80 మంది చనిపోయినట్టు సమాచారం. ఇక, భారత దళాల దాడుల నేపథ్యంలో పాకిస్తాన్‌లో అర్ధరాత్రి కూడా సూర్యోదయంలా కనిపించింది. భారత మెరుపు దాడుల కారణంగా వెలుగులు బయటకు వచ్చాయి.

భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెప్పారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు.. పహల్గాంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు కూడా కేంద్రం నిర్ణయం, ఈ ఆపరేషన్‌ పట్ల ధన్యవాదాలు చెబుతున్నారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు మరిన్ని దాడులు చేయాలని వ్యాఖ్యలు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. భారత దాడుల సందర్భంగా పాకిస్తాన్‌లో పరిస్థితులపై సోషల్‌ మీడియా వేదికగా పలువురు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. అర్థరాత్రి రెండు గంటలకే పాకిస్తాన్‌లో సూర్యోదయం వచ్చిందని కర్ణాటక బీజేపీ ట్విట్టర్‌లో ఫన్నీ పోస్టును పెట్టింది. ఇక, పలువురు నెటిజన్లు వీడియోలు ఫోస్టు చేస్తూ దివాళి ముందే వచ్చేసిందనే సినిమా డైలాగ్‌తో పోస్టులు చేస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement