
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత దళాలు ఇవాళ (మే 8) పాకిస్తాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై డ్రోన్‌లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా ఇవాళ జరగాల్సిన పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మ్యాచ్ రద్దైంది. ఈ లీగ్‌లో మున్ముందు జరగాల్సిన మ్యాచ్‌లపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.
ఈ దాడి అనంతరం పీఎస్‌ఎల్ 2025 ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ లీగ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, యూఎస్‌ఏ, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాలకు చెందిన దాదాపు 40 మంది క్రికెటర్లు పాల్గొంటున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్ పాక్‌పై కన్నెర్ర చేయడంతో పీఎస్‌ఎల్ ఆడుతున్న విదేశీ క్రికెటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భారత్ దాడుల తీవ్రతను పెంచిన తర్వాత చాలామంది విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లిపోవాలని భావిస్తున్నారు. అయితే పాక్‌లో విమానాశ్రయాలు మూత పడటంతో వారు ఎటూ వెళ్లలేకపోతున్నారు. ఈ లీగ్‌లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ లాంటి స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు.
PSL 2025 ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు..
ఇస్లామాబాద్ యునైటెడ్:
ఆస్ట్రేలియా - మాథ్యూ షార్ట్, రిలే మెరిడిత్, బెన్ డ్వార్హుయిస్;
న్యూజిలాండ్ - కాలిన్ మున్రో;
దక్షిణాఫ్రికా - రాస్సీ వాన్ డెర్ డస్సెన్;
యూఎస్‌ఏ - ఆండ్రీస్ గౌస్;
వెస్టిండీస్ - జాసన్ హోల్డర్
కరాచీ కింగ్స్:
ఆఫ్ఘనిస్తాన్ - మొహమ్మద్ నబీ;
ఆస్ట్రేలియా - డేవిడ్ వార్నర్, బెన్ మెక్‌డెర్మాట్;
ఇంగ్లాండ్ - జేమ్స్ విన్స్;
న్యూజిలాండ్ - టిమ్ సీఫెర్ట్, ఆడమ్ మిల్నే, కేన్ విలియమ్సన్.
లాహోర్ ఖలందర్స్:
బంగ్లాదేశ్ - రిషద్ హొస్సేన్;
ఇంగ్లాండ్ - సామ్ బిల్లింగ్స్, టామ్ కుర్రాన్;
నమీబియా - డేవిడ్ వైస్;
శ్రీలంక - కుసల్ పెరెరా;
న్యూజిలాండ్ - డారిల్ మిచెల్,
జింబాబ్వే - సికందర్ రజా.
ముల్తాన్ సుల్తాన్స్:
ఆస్ట్రేలియా - ఆష్టన్ టర్నర్;
ఇంగ్లాండ్ - డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్;
న్యూజిలాండ్ - మైఖేల్ బ్రేస్‌వెల్;
వెస్టిండీస్ - గుడకేష్ మోటీ, షాయ్ హోప్,
ఐర్లాండ్ - జోష్ లిటిల్.
పెషావర్ జల్మీ:
ఆఫ్ఘనిస్తాన్ - నజీబుల్లా జద్రాన్;
ఆస్ట్రేలియా - మాక్స్ బ్రయంట్,
బంగ్లాదేశ్ - నహిద్ రానా,
ఇంగ్లాండ్ - టామ్ కోహ్లర్-కాడ్మోర్;
దక్షిణాఫ్రికా - లిజాడ్ విలియమ్స్,
వెస్టిండీస్ - అల్జరీ జోసెఫ్.
క్వెట్టా గ్లాడియేటర్స్:
న్యూజిలాండ్ - ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, కైల్ జామీసన్;
దక్షిణాఫ్రికా - రిలీ రోసౌ;
వెస్టిండీస్ - అకేల్ హోసేన్