
టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు కేంద్రం ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య, ఆపరేషన్ సిందూర్ ఉగ్రమూకలకు చుక్కలు చూపింది. కోట్లాదిమంది భారతీయులకు ప్రేరణగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని ఒక మెడికల్ కాలేజీలో ఉత్సాహకరమైన పరిణామం చోటు చేసుకుంది.గత నెలలో పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకొనేందుకు పాకిస్తాన్‌పై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సాహంతోనే తన బిడ్డలకు సిందూర్ పేరు పెట్టుకునేందుకు చాలామంది దంపతులు ముందుకొచ్చారు.
మే 10 -11 తేదీలలో కుషినగర్ మెడికల్ కాలేజీలో రెండు రోజుల వ్యవధిలో జన్మించిన 17 మంది నవజాత బాలికలకు వారి కుటుంబ సభ్యులు సిందూర్ అని పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే షాహి సోమవారం పిటిఐకి తెలియజేశారు.ఇది తమకు గర్వకారణమంటూ తల్లిదండ్రులను సంతోసం ప్రకటించారు. "పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇచ్చినందుకు" తాము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ భారత సాయుధ దళాలను ప్రశంసించారు. "పహల్గామ్ దాడి తరువాత, భర్తలను కోల్పోయిన అనేక మంది వివాహిత మహిళల జీవితాలు నాశనమయ్యాయి. దానికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. దీనికి గర్విస్తున్నాజ ఇప్పుడు, సిందూర్ అనేది ఒక పదం కాదు, ఒక భావోద్వేగం. కాబట్టి మా కుమార్తెకు సిందూర్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాము" ఇటీవల ఆడ శిశువుకు జన్మనిచ్చిన కుషినగర్ నివాసి అర్చన షాహి అన్నారు. ఆమె భర్త అజిత్ షాహి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 26 మంది అమాయకులను చంపినందుకు భారతదేశం ప్రతీకారం తీర్చుకున్నప్పటి నుండి, తన కోడలు కాజల్ గుప్తా తన నవజాత శిశువుకు సిందూర్ అని పేరు పెట్టాలని కోరుకుంటుందని పద్రౌనాకు చెందిన మదన్ గుప్తా అన్నారు.
ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర
"ఆ విధంగా, మేము ఈ ఆపరేషన్‌ను గుర్తుంచుకోవడమే కాకుండా ఈ రోజును పండగలా జరుపుకుంటాం" అని మిస్టర్ గుప్తా పిటిఐకి చెప్పారు. భతాహి బాబు గ్రామానికి చెందిన వ్యాసముని కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, తమ నిర్ణయం తమ కుమార్తెలో ధైర్యాన్ని నింపుతుందని చెప్పాడు."నా కూతురు పెద్దయ్యాక, ఈ పదం అర్థాన్ని , పరమార్థాన్ని’ తెలుసుకుంటుంది. భారతమాత పట్ల విధేయత కలిగిన మహిళగా ఉంటుంది’’ అన్నారు. ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక పట్టణం పహల్గామ్ సమీపంలోని బైసారన్ గడ్డి మైదానంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇరవై ఆరు మంది మరణించగా, చాలామంది గాయపడ్డారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత-కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ముఖ్యంగా మహిళా అధికారిణులు కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈ ఆపరేషన్‌తో సంచలనం రేపడం విశేషం.
ఇదీ చదవండి:138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో