
పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులకు దిగింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఏకంగా తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ప్రపంచ దేశాలకు భారత ఉన్నతాధికారులు వివరించారు. అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలకు భారత్ సమాచారం ఇచ్చింది. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో భారత్ చేసిన మెరుపు దాడులపై పాక్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.
దాడులపై స్పందించిన పాక్ ప్రధాని, ఆర్మీ
భారత్ తమ దేశంపై దాడులు చేసినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. ఈమేరకు పాక్ లెప్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ ఒక లేఖ విడుదల చేశారు. పాక్, భారత్ సరిహద్దులకు కొద్ది దూరంలో ఉన్న బహవల్పూర్,కొట్లీ, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు ఆయన తెలిపాడు. అయితే, ఈ దాడుల్లో ముగ్గురు మరణించారని పాక్ ప్రకటించింది.అయితే, పదికిపైగా చనిపోయినట్లు తెలుస్తొంది. సుమారు 15మందికి తీవ్రమైన గాయాలైనట్లు పాక్ ఆర్మీ తెలిపింది. ఈ దాడికి పాల్పడిన భారత్‌పై తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ప్రకటించింది. ఇప్పుడు భారత్ తాత్కాలిక సంతోషంతో ఉండొచ్చు.. కానీ, శాశ్వత దుఃఖంతో తాము భర్తీ చేస్తామని పాక్ లెప్టినెంట్ జనరల్ అన్నాడు. ఇదే సమయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా స్పందించారు.
పాకిస్తాన్‌లోని ఐదు ప్రదేశాలపై మోసపూరిత శత్రువు పిరికి దాడి చేసింది. భారతదేశం విధించిన ఈ యుద్ధోన్మాద చర్యకు బలవంతంగా స్పందించే హక్కు పాకిస్తాన్‌కు పూర్తిగా ఉంది. దానికి గట్టిగా ప్రతిస్పందన ఇవ్వబడుతుంది. మొత్తం దేశం పాకిస్తాన్ సాయుధ దళాలకు అండగా నిలుస్తుంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్, ఆర్మీకి బాగా తెలుసు. శత్రువు తన దుర్మార్గపు లక్ష్యాలలో విజయం సాధించడానికి మేము ఎప్పటికీ అనుమతించము.' అని ఆయన తెలిపారు.
స్పందించిన అమెరికా అధ్యక్షుడు
భారత్, పాక్ దేశాల మధ్య పరిస్థితిని జాగ్రత్తగా తాము గమనిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియో రియాక్ట్ అయ్యారు. ఆపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలా స్పందించారు. 'ఇరు దేశాల మధ్య పరిస్థితిలు చాలా దారుణంగా ఉన్నాయి. భారత్, పాక్‌లు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నాయి. ఉద్రిక్తతలు ఇరు దేశాలు తగ్గించుకోవాలి. ఇదొక హేయమైన చర్య. రెండు శక్తివంతమైన దేశాలు రోడ్లపైకి వచ్చి ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరు. ప్రపంచానికి శాంతి కావాలి, ఘర్షణలు వద్దు' అని ట్రంప్ అన్నారు.
Happy Diwali, Pakistan
Indian army 🔥Jai Hind 🇮🇳#OperationSindoor pic.twitter.com/grYxrv26WZ— Vishal (@VishalMalvi_) May 6, 2025