'ఆపరేషన్ సిందూర్'పై నోరెత్తని బాలీవుడ్‌ ప్రముఖులు | Bollywood Top Actors Not Respond Operation Sindoor | Sakshi
Sakshi News home page

'ఆపరేషన్ సిందూర్'పై నోరెత్తని బాలీవుడ్‌ ప్రముఖులు

May 9 2025 9:01 AM | Updated on May 9 2025 9:00 AM

Bollywood Top Actors Not Respond Operation Sindoor

పహల్గామ్‌లో 26 మంది భారతీయులను కాల్చి చంపిన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు  'ఆపరేషన్‌ సిందూర్‌'‌ను భారత్‌ ప్రారంభించింది. పాక్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన భారత్‌ 100 మందికి పైగానే ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఈ క్రమంలోనే పాక్‌ ఆర్మీ మరోసారి తన వక్రబుద్ధి చూపించింది. జమ్మూ ఎయిర్‌పోర్టుతో పాటు జైసల్మేర్‌ విమానాశ్రయం లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. వాటిని భారత్‌ సమర్థంగా తిప్పికొట్టింది. 

దీంతో మన సైనికులపై చాలామంది సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ మాతాకీ జై అంటూ టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు నటీనటులు పోస్టులు పెడుతున్నారు. కానీ హిందీ చిత్రపరిశ్రమలో టాప్‌ హీరోలుగా ఉన్న అమితాబ్‌ బచ్చన్‌, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి వారు కనీసం తమ మద్ధతు ఇస్తూ ఒక్క పోస్ట్‌ కూడా చేయలేదు. దీంతో వారి అభిమానులు కూడా విమర్శలు చేస్తున్నారు.  దేశాన్ని  కాపాడుతున్న సైనికులకు కనీసం కృతజ్ఞతలు చెప్పడానికి కూడా వారికి మనసు రావడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

సైఫ్ అలీఖాన్ కూడా ఆపరేషన్‌ సిందూర్‌పై ఎలాంటి పోస్ట్‌ చేయలేదు. దీంతో ఆయనపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఏదైన  ఒక సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించి దానిని వెంటనే తమ సోషల్‌మీడియాలో షేర్‌ చేసి కోట్ల రూపాయాలు సంపాధిస్తారు. అలాంటిది దేశంలో ఇంత జరుగుతున్నా కూడా కనీసం మన ఆర్మీ కోసం మద్ధతుగా ఒక్క పోస్ట్‌ కూడా పెట్టలేదంటూ నెటిజన్లు భగ్గుమంటున్నారు. దేశ ప్రజల పట్ల, మన ఆర్మీ పట్ల వారికి ఉన్న గౌరవం ఏపాటిదో సులభంగా అర్థం అవుతుంది అంటూ వారు చెప్పుకొస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement