
జైపూర్: దేశంలో అక్రమ వలస దారుల ఏరివేత కార్యక్రమం మరింత పుంజుకుంది.. భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న ఇతర దేశస్తులను వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ వలసదారుల్ని ఏరివేసే పనిలో పడ్డాయి. ఇటీవల గుజరాత్ లో అక్రమంగా ఉంటున్న వెయ్యి మందికి పైగా బంగ్లాదేశీయులను వెనక్కి పంపించగా, తాజాగా రాజస్తాన్ లో కూడా వెయ్యికి పైగా బంగ్లాదేశ్ కు చెందిన అక్రమ వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
వీరిని ప్రస్తుతం తమ దేశానికి పంపించే యత్నం చేస్తున్నారు. రాజస్తాన్ లోని 17 జిల్లాల్లో జల్లెడ పడితే 1,008 మంది బంగ్లాదేశీయులు దొరికారు. ఒక్క సిల్కార్ జిల్లాలోనే 394 మంది అక్రమ బంగ్లాదేశీయులు ఉండటం గమనార్హం. వీరందర్నీ ఇప్పుడు దేశం దాటించే పనిలో పడ్డాయి ఎయిర్ ఫోర్స్, బీఎస్ఎఫ్ సిబ్బంది.
పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ లో ఉండే అక్రమ వలసదారుల్ని ఏరివేస్తున్నారు. ప్రధానంగా అక్రమంగా ఉండే పాకిస్తానీయులిపై వెంటనే ఆ దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క‍్రమంలోనే బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్ లో అక్రమంగా స్థిరపడిన వారు వేలల్లో పోలీసులకు పట్టుబడుతున్నారు.
#WATCH | Rajasthan: First batch of Bangladeshi nationals, who were living illegally in India, and were caught in the past few days were brought to Jodhpur today. They are being deported to Bangladesh. pic.twitter.com/hLqKxDSlb5
— ANI (@ANI) May 14, 2025
ఇది కూడా చదవండి: