
పట్నా: బీహార్ ఓటర్లు లిస్టులో వింత వైనాలు వెలుగు చూస్తున్నాయి. 1950లలో భారత్‌లోకి ప్రవేశించిన ఇద్దరు పాకిస్తానీ మహిళలు బీహార్‌లో ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు వెల్లడయ్యింది. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హోం మంత్రిత్వ శాఖ ఇటీవల వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉండిపోయిన విదేశీయుల రికార్డులను తనిఖీ చేస్తున్నప్పుడు ఈ ఉదంతం వెలుగు చూసింది.
భాగల్పూర్‌కు చెందిన ఇద్దరు మహిళలు విదేశీ పౌరులుగా ఓటర్ల సవరణలో తేలారని అధికారులు నిర్ధారించారు. ఓటర్ల ధృవీకరణ నిర్వహించిన బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ)మాట్లాడుతూ ఆ మహిళలకు సరిపోయే పాస్‌పోర్ట్ వివరాలతో కూడిన అధికారిక సమాచారం అందిందన్నారు. వారిలో ఒకరి పేరు ఇమ్రానా ఖానం. ఆమె వృద్ధురాలు. అనారోగ్యంతో ఉన్నందున మాట్లాడే స్థితిలో లేదు. ఆమె పాస్‌పోర్ట్ 1956 నాటిది. ఇంకొక మహిళ కూడా ఇలానే భారత్‌లో ఉంటున్నారు. శాఖాపరమైన సూచనలను అనుసరించి వారి పేర్లను తొలగించే ప్రక్రియను ప్రారంభించామని సంబంధిత అధికారులు తెలిపారు.
#WATCH | Bhagalpur, Bihar: A Pakistani woman, who came to India in 1956, has been found to be in Bihar's voter list and was even verified in the SIR carried out in the state. When the Home Ministry started carrying out an investigation regarding foreign nationals who had… pic.twitter.com/CodczsabaD
— ANI (@ANI) August 24, 2025
కాగా ఈ పాక్ మహిళల ఉదంతం అధికారిక విచారణలో ఉంది. ఉన్నతాధిధికారులు వీరిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సివుంది. దీనిపై ఆగస్టు 11న హోం మంత్రిత్వ శాఖ నుండి నోటీసు స్థానిక ఎన్నికల కార్యాలయానికి చేరుకుంది. తక్షణం వారిపై చర్యలు చేపట్టాలని దానిలో కోరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన ఓటరు కార్డుల సవరణ వివాదానికి దారితీసింది. ప్రతిపక్ష పార్టీలు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, ఇవి జరగుతున్నాయని ఆరోపించాయి. అయితే నిస్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యతతోన ఈ సవరణ చేపట్టామని సంబంధిత అధికారులు తెలిపారు.