వారి ఆదేశాలతోనే ఉగ్రదాడి.. ‘పహల్గామ్‌’పై సంచలన నివేదిక | Pahalgam Attack Executed by ISI, Lashkar on Directions of Pakistan's Politicians | Sakshi
Sakshi News home page

వారి ఆదేశాలతోనే ఉగ్రదాడి.. ‘పహల్గామ్‌’పై సంచలన నివేదిక

Jul 15 2025 12:31 PM | Updated on Jul 15 2025 12:41 PM

Pahalgam Attack Executed by ISI, Lashkar on Directions of Pakistan's Politicians

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్‌కు చెందిన రాజకీయ నేతలు, సైనిక అధికారుల ఆదేశాల మేర​కే జరిగిందని, ఇది పాక్‌ ఐఎస్‌ఐ, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)చేసిన కుట్ర అని భద్రతా వర్గాలు వెల్లడించాయి.  కాగా ఈ ఉగ్రదాడి అనంతరం మే 7న పాకిస్తాన్, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ ‘ఆపరేషన్ సింధూర్‌’పేరుతో ప్రతీకార దాడులు చేపట్టింది.

పహల్గామ్‌ దాడికి విదేశీ ఉగ్రవాదులను మాత్రమే మోహరించాలని, పూర్తి గోప్యతను పాటించాలని, కశ్మీరీ ఉగ్రవాదులను తీసుకోవద్దని ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ .. లష్కర్ కమాండర్ సాజిద్ జట్‌కు నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చిందని భద్రతా వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా జమ్ముకశ్మీర్‌ ఉంటున్న విదేశీ ఉగ్రవాదుల ప్రమేయంతో ఈ దాడులకు పాల్పడాలని కూడా వారు సూచించారని సమాచారం. స్థానిక ఉగ్రవాదులు ఈ ఘటనలో పాల్గొనలేదని ఒక సీనియర్ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.

నిషేధిత లష్కరే తోయిబా సంస్థకు ప్రాక్సీ గ్రూప్ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ పహల్గామ్ దాడికి బాధ్యత వహించింది. దాడి చేసిన ఇద్దరూ పాకిస్తాన్ జాతీయులుగా భద్రతా దళాలు గుర్తించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలతో ఇద్దరు స్థానికులను అరెస్ట్‌ చేశారు. మే 7న ‘ఆపరేషన్ సిందూర్‌’తో భారత్‌ ఈ ఉగ్ర దాడికి ప్రతిస్పందించింది. పాకిస్తాన్, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై బాంబు దాడులు చేసి, వందమంది ఉగ్రవాదులను అంతమొందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement