
అందాల కశ్మీరం ఉగ్రవాదులతో దశాబ్దాలుగా అగ్నిగుండంగా మారింది. 2000 నుంచి అక్కడ జరిగిన దాడులకు 700 మందికి పైగా భద్రతా సిబ్బంది, పౌరులు బలయ్యారు. వాటిలో ముఖ్యమైనవి..
2000 మార్చి 21: అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్‌లో పర్యటిస్తున్న వేళ టెర్రరిస్టులు చెలరేగిపోయారు. అనంత్‌నాగ్ జిల్లా చట్టీసింగ్‌పురా గ్రామంలో 36 మంది సిక్కులను కాల్చి చంపారు.
∙ 2000లోనే అమర్‌నాథ్ యాత్రికులపై పహల్గాం బేస్ క్యాంప్ వద్ద జరిగిన ఉగ్ర దాడిలో 32 మంది మరణించారు.
∙ 2001లో 13 మంది, 2002లో 11 మంది అమర్‌నాథ్ యాత్రికులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు.
∙ 2001 అక్టోబర్ 1న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ప్రాంగణంపై జరిగిన ఆత్మాహుతి దాడికి 36 మంది బలయ్యారు.
∙ 2002లో జమ్మూ–శ్రీనగర్ హైవేపై ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు భద్రతా సిబ్బందితో పాటు 19 మంది మరణించారు.
∙ 2003లో పుల్వామా జిల్లా నందిమార్గ్‌లో 24 మంది కశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు.
∙2014: ఉరిలో ఆత్మాహుతి దాడికి దిగి 17 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు.
∙2015: కథువా పోలీస్ స్టేషన్‌పై దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు.
∙2016: ఉరిలో సైనిక క్యాంపుపై దాడికి తెగబడి 18 మంది సిబ్బందిని పొట్టన పెట్టుకున్నారు.
∙2017లో అమర్‌నాథ్ యాత్ర నుంచి తిరిగొస్తున్న భక్తులపై కాల్పుల్లో 18 మంది మరణించారు.
∙2019: పుల్వామాలో సీఆరీ్పఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడికి 40 మంది జవాన్లు బలయ్యారు.
∙2025 ఏప్రిల్ 22: బైసారన్‌లో 26 మంది పర్యాటకులను కాల్చిచంపారు.