
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. షోపియాన్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతయ్యారు. అయితే భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో.. ఒక ఉగ్రవాది పహల్గాం దాడి అనుమానిత ఉగ్రవాదేనన్న అనుమానం నెలకొంది.
మరోవైపు, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గురించి సమాచారం అందించాలని ప్రజలను కోరుతూ పోలీసులు జమ్మూకశ్మీర్‌లోని షోపియన్ జిల్లా అంతటా పోస్టర్లను అతికించారు. ఈ పాకిస్తానీ ఉగ్రవాదుల గురించి నిర్ధిష్ట సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల బహుమతి అందిస్తామని పోస్టర్లలో పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఉగ్రవాదులపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు షోపియాన్ జిల్లాలో మొహరించారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో ఓ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం వేటని ముమ్మరం చేశాయి.
#BREAKING: J&K Police has pasted Posters across Shopian district of Jammu & Kashmir urging people to provide information of those terrorists involved in Pahalgam terror attack.
Rs 20 lakh reward to the person who will provide any information about these Pakistani terrorists. pic.twitter.com/zjV7VUWtFb— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 13, 2025