
యువకుడిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
న్యూఢిల్లీ: ఓ ఆగంతకుడు పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించేందుకు ప్రయతి్నంచాడు. నిచ్చెన సహాయంతో లోపలికి ప్రవేశించాడు. శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో రైల్ భవన్ వైపు నుంచి గోడ ఎక్కి పాత పార్లమెంట్ భవనం గరుడ ద్వారం వరకు చేరుకోగలిగాడు. కాంప్లెక్స్ లోపల మోహరించిన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు.
దుండగుడు ఉత్తరప్రదేశ్ నివాసి రామ్‌కుమార్ బింద్(20) అని, గుజరాత్‌లోని సూరత్‌లో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని అధికార వర్గాలు తెలిపాయి. అదుపులోకి తీసుకున్న సమయంలో అతను మానసికంగా బాధపడుతున్నట్లు తెలిసింది. తాను ఇంటికి వెళ్లాలనుకుంటున్నానని, పార్లమెంట్‌కు చేరుకునే ముందు రైల్వే స్టేషన్‌కు కూడా వెళ్లానని, కానీ రైలు ఎక్కలేకపోయానని విచారణలో చెప్పాడు.
ప్రస్తుతం, పార్లమెంట్ భద్రతా విభాగం అతడిని ప్రశ్నిస్తోంది. ప్రాథమిక విచారణ పూర్తయిన తరువాత చొరబాటుదారుడిని స్థానిక పోలీసులకు విచారణ కోసం అప్పగిస్తామని అధికారులు తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన ఒక రోజు తర్వాత ఈ ఘటన జరిగింది. ఉల్లంఘన జరిగిన సమయంలో పార్లమెంటు సభ్యులెవరూ అక్కడ లేరు. ఈ ఘటన నేపథ్యంలో పార్లమెంట్ భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

A person entered the Parliament building in the morning by jumping over the wall with the help of a tree. He reached the Garuda Gate of the new Parliament building by jumping over the wall from the Rail Bhawan side. The security present in the Parliament building has caught the…
— ANI (@ANI) August 22, 2025