సుప్రీం కోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా రేపు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ బీఆర్.గవాయ్ పదవీకాలం నేటితో ముగిసింది ఈనేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
1962 ఫిబ్రవరి10న హర్యాణాలోని హిసార్ జిల్లాలో జస్టిస్ సూర్యకాంత్ జన్మించారు. 1984లో మహర్షి దయానంద్ న్యాయవాద యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా అందుకున్నారు. అనంతరం 2011లో డిస్టెన్స్ లో ఎల్ఎల్ఎమ్ పూర్తి చేశారు. 2018న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆర్టికల్ 370, బిహార్ ఓట్ల సవరణ, పెగాసెస్ స్పైవేర్ కు సంబంధించిన పలు కీలక తీర్పులలో ఆయన జడ్జిగా వ్యవహరించారు. జస్టిస్ సూర్యకాంత్ ఫిబ్రవరి9, 2027 వరకూ ఈ బాధ్యతలో కొనసాగనున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాధ్యతలు చేపట్టిన తొలి హర్యాణా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించనున్నారు.


