సాక్షి, తిరువనంతపురం: శబరిమలలో రేపటివరకు (24వ తేదీ) తక్షణ దర్శనానికి అనుమతించే బుకింగ్ సంఖ్యను 5 వేలుగా పరిమితం చేయాలని కేరళ హైకోర్టు ముందుగా ఆదేశించింది. దీనిపై దేవస్వం బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు, పరిస్థితులను బట్టి తక్షణ బుకింగ్ సంఖ్యను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.
దీన్ని అనుసరించి నిన్నటి నుంచి వర్చువల్ బుకింగ్ సంఖ్య పెంచింది. ప్రస్తుతం ఒక నిమిషానికి 85 మంది భక్తులు వరకు 18వ మెట్టుకు ఎక్కడానికి అనుమతి ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది దేవస్వం బోర్డు.


