
కొన్నాళ్ల క్రితం కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి గుర్తుండే ఉంటుంది. హనీమూన్ కోసం అక్కడికి అదేరోజు వెళ్లిన నేవీ అధికారి వినయ్ నర్వాల్.. ఉగ్రవాదుల్లో కాల్పుల్లో మరణించాడు. ఇతడి పక్కనే రోదిస్తున్న భార్య హిమాన్షి నర్వాల్ ఫొటో అప్పుడు తెగ వైరల్ అయింది. ఆమెకు చాలామంది సానుభూతి తెలియజేశారు. అలాంటిది ఇప్పుడు ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది. దానికి కారణం 'బిగ్‌బాస్'.
ఈ నెల 24 నుంచి హిందీలో బిగ్‌బాస్ 19వ సీజన్ మొదలుకానుంది. దీనిలో ఎవరెవరు పాల్గొంటారు అనే విషయమై కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో హిమాన్షి నర్వాల్ పేరు కూడా ఉండటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే భర్త, ఉగ్రదాడిలో చనిపోయి ఎన్నిరోజులు కాలేదు అలాంటిది ఈమె షోలో పాల్గొంటుందా అని మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: 'అరుంధతి' చైల్డ్ ఆర్టిస్ట్‌కి పెళ్లి.. ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ)
బాలీవుడ్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఈసారి బిగ్‌బాస్ షో నిర్వహకులు.. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కంటెస్టెంట్స్‌ని కోరుకుంటున్నారని, ఈ క్రమంలోనే హిమాన్షిని తీసుకురావాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో నిజం లేదని మరికొందరు అంటున్నారు. ఇది దేశానికి సంబంధించిన చాలా సున్నితమైన అంశం అని.. అసలు నిర్వహకులు ఈమెని సంప్రదించలేదని, షోలో పాల్గొనే అవకాశమే లేదని కొట్టిపారేస్తున్నారు.
హిమాన్షి కథ వెనకున్న విషాదం చాలామంది భారతీయుల్ని కదిలించింది. ఎందుకంటే పెళ్లి చేసుకుని కొన్నిరోజులకే హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లగా.. అక్కడ ఈ దంపతులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ దాడిలో ఈమె భర్త, నేవీ అధికారి వినయ్ నర్వాల్ చనిపోయారు. హిమాన్షి క్షేమంగా బయటపడింది. ఘటన స్థలంలోనే నిర్జీవంగా ఉన్న భర్త పక్కన ఈమె కన్నీళ్లు పెడుతున్న ఫొటోలు.. దేశవ్యాప్తంగా చాలామందిని ఎమోషనల్ అయ్యేలా చేసింది.
(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి టాలీవుడ్ లేడీ సింగర్ సమీర భరద్వాజ్.. ఫొటోలు)