
టాలీవుడ్‌లో చాలామంది సింగర్స్ ఉన్నారు. అయితే పాడటంతో పాటు ఇన్ స్టాలో కామెడీ రీల్స్ చేస్తూ ఈ మధ్య కాలంలో వైరల్ అయిన గాయని సమీర భరద్వాజ్. రీసెంట్ టైంలో నటిగా మారిన ఈమె.. టీవీ షోల్లోనూ కనిపిస్తుంది. ఇప్పుడు ఈమె కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. తమ గృహప్రవేశానికి సంబంధించిన ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: మరో హిస్టరీ క్రియేట్ చేసిన 'మహావతార నరసింహ')
బ్రూస్ లీ, సరైనోడు, శతమానం భవతి, నేను లోకల్, వాల్తేరు వీరయ్య, రాజా ది గ్రేట్ తదితర సినిమాల్లో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్న సమీర భరద్వాజ్.. నటిగానూ ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా కాస్త పాపులారిటీ సొంతం చేసుకుంది. అలా ఈమె యాక్టింగ్ బాగుండటంతో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి.. రీసెంట్‌గా తీసిన 'సారంగపాణి జాతకం' సినిమాలో అవకాశమిచ్చాడు. మరోవైపు కూతురు ఆద్యతో కలిసి శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఓ కామెడీ రియాలిటీ షోలోనూ సమీర పాల్గొంది.
ఇప్పుడు భర్తతో కలిసి గృహప్రవేశం చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో పలువురు టీవీ సెలబ్రిటీలు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం టీవీ షోల్లో సమీర భరద్వాజ్ తరుచుగా కనిపించడం చూస్తుంటే ఈమె కూడా త్వరలో బిగ్ బాస్ షోలో అడుగుపెడుతుందేమో అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: 'అరుంధతి' చైల్డ్ ఆర్టిస్ట్‌కి పెళ్లి.. ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ)