
ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు చాలామంది పెద్దోళ్లు అయిపోయారు. కొందరు నటులైతే మరికొందరు వేర్వేరు ఫ్రొఫెషన్స్‌లో సెటిల్ అయిపోయారు. అసలు విషయానికొస్తే 'అరుంధతి' సినిమాలో బాలనటిగా చేసిన దివ్య ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది. ప్రస్తుతం తన ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంది. ఇంతకీ పెళ్లెప్పుడు? చేసుకోబోయే కుర్రాడు ఎవరనేది చూద్దాం.
(ఇదీ చదవండి: మరో హిస్టరీ క్రియేట్ చేసిన 'మహావతార నరసింహ')
తెలుగు-తమిళ మూలాలున్న కుటుంబానికి చెందిన దివ్య నగేశ్.. 'అరుంధతి' సినిమాలో చిన్న జేజమ్మగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంతో పాటు అపరిచితుడు, సింగం పులి తదితర మూవీస్ కూడా చేసింది. ప్రస్తుతం డ్యాన్సర్, మోడల్‌గా చేస్తూ నటిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. గత ఐదేళ్లుగా సహనటుడు, కొరియోగ్రాఫర్ అజయ్ కుమార్‌ని ప్రేమిస్తున్న దివ్య.. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుంది. మరో 8 రోజుల్లో అంటే ఆగస్టు 18న పెళ్లి చేసుకోబోతుంది.

ఈ క్రమంలోనే వెడ్డింగ్ ఫొటోషూట్స్‌లో దివ్య బిజీగా ఉంది. అలానే తన లేడీ ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ చేసుకుంది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈమెకు అప్పుడే శుభాకాంక్షలు చెబుతున్నారు. స్వతహాగా ఈమె పేరు దివ్య నగేశ్.. కానీ దివ్య అరుంధతిగా ఇన్ స్టాలో పేరు మార్చుకుంది. అయితే 'అరుంధతి'లో చేసిన బాలనటికి పెళ్లయిపోతుంది కానీ ఇదే మూవీలో చేసిన అనుష్క మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉంది. మరి స్వీటీ అసలు వివాహం చేసుకుంటుందో లేదో?
(ఇదీ చదవండి: నేనెవరిని కలవలేదు.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి)

