
కరాచీ: గ్లోబల్ టెర్రరిస్టు, భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు మసూద్ అజార్ తమ దేశంలో లేడని బుకాయిస్తు వస్తున్న పాకిస్తాన్ దొంగ బుద్ధి మరోసారి బయటపడింది. పాక్ చెబుతున్నది ఎంతమాత్రం నిజం కాదనే విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తేటతెల్లం చేశాయి. మసూద్ అజార్ పాక్‌లో ఉన్న విషయాన్ని భారత్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు పసిగట్టేశాయి.
పీవోకే(పాక్ ఆక్రమిత కశ్మర్) పరిధిలో గిల్జిట్ బాలిస్తాన్ ప్రాంతంలో మసూద్ సంచరించిన విషయాన్ని తాజాగా వెల్లడించాయి. మసూద్ అజార్ కదలికల్ని అత్యంత దగ్గరగా నిశితంగా పరిశీలిస్తున్న భారత్ ఇంటెలిజెన్స్.. బహవల్పూర్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో మసూద్ నివాస జాడలు ఉన్నట్లు తెలిపింది. ఇటీవల మసూజ్ అజాయర్ స్కర్దూ, సద్‌పారా ఏరియాల్లో కనిపించిన విషయాన్ని కూడా ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది. అక్కడ ప్రధానంగా పలు ప్రైవేటు, గవర్నమెంట్ గెస్ట్ హౌస్‌ల్లో మసూద్ కనిపించాడు.
కాగా, ఇటీవల ఆల్ అజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిల్వాల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. మసూద్ అజార్ తమ దేశంలో లేడంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ పాకిస్తాన్‌లో ఉన్నాడని భారత్ సమాచారం ఇస్తే తాము సంతోషంగా అతన్ని అరెస్ట్ చేస్తామని కూడా బుకాయించే యత్నం చేశారు. ఇప్పుడు పాకిస్తాన్‌లోనే అజార్ ఉన్నాడని భారత ఇంటెలిజెన్స్ స్పష్టం చేసిన తరుణంలో బిల్వాల భుట్టో ఏమంటాడో చూడాలి
భారత్‌లో ఉగ్రదాడులకు సూత్రధారి
భారత్‌లో ఇప్పటివరకూ జరుగుతూ వచ్చిన ఉగ్రదాడుల వెనుక మసూద్ అజార్‌ది కీలక పాత్ర. 2016లో పఠాన్‌కోట్‌లో ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడితో పాటు 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్న ఘటనలో కూడా మసూద్ అజార్ ‘పాత్ర ఉంది. ఆ నేపథ్యంలో భారత్ మోస్గ్ వాంటెడ్ ఉగ్రవాదిగా మసూద్ అజార్ ఉన్నాడు.