బ్రిటన్‌ పౌరులకు డిజిటల్‌ ఐడీ కార్డులు  | New digital ID scheme to be rolled out across UK | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ పౌరులకు డిజిటల్‌ ఐడీ కార్డులు 

Sep 27 2025 6:04 AM | Updated on Sep 27 2025 6:47 AM

New digital ID scheme to be rolled out across UK

అక్రమ వలసల నిరోధానికేనన్న ప్రధాని స్టార్మర్‌ 

లండన్‌: బ్రిటన్‌ పౌరులకు త్వరలో డిజిటల్‌ ఐడీ కార్డులు రానున్నాయి. ప్రభుత్వ సేవలు పొందేందుకు, ఉద్యోగాలు సంపాదించేందుకు కూడా ఈ కార్డులు తప్పనిసరి కానున్నాయి. బ్రిటన్‌ పౌరులతోపాటు దేశంలో శాశ్వత నివాస అర్హత పొందిన విదేశీయులకు కూడా ఈ డిజిటల్‌ ఐడీ కార్డులు అందజేస్తామని బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ తెలిపారు. 

ఈ కార్డుల వల్ల పౌరుల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి ప్రమాదం వాటిల్లదని పేర్కొన్నారు. పౌరులు భౌతికమైన కార్డులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని, స్మార్ట్‌ఫోన్‌ లేని పౌరులు కూడా ఈ కార్డును అవసరమైన చోట వాడుకోవచ్చని వివరించారు. 20 ఏళ్ల క్రితమే వీటిని ప్రవేశపెట్టాలని ప్రయతి్నంచిన అప్పటి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement