ప్రముఖ కంపెనీలో 1,500 మందికి లేఆఫ్స్‌ | PwC Announces Layoffs 1500 US Employees Impacted Amid Industry Shifts | Sakshi
Sakshi News home page

ప్రముఖ కంపెనీలో 1,500 మందికి లేఆఫ్స్‌

May 8 2025 11:38 AM | Updated on May 8 2025 12:01 PM

PwC Announces Layoffs 1500 US Employees Impacted Amid Industry Shifts

ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల మధ్య దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించే లక్ష్యంతో ప్రముఖ ఆడిటింగ్‌ సంస్థ ప్రైస్‌వాటర్‌హౌజ్‌కూపర్స్‌(పీడబ్ల్యూసీ) 1,500 మంది ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించింది. కంపెనీ తాజా నిర్ణయంతో యూఎస్ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ ఉద్యోగుల తొలగింపు దాని మొత్తం సిబ్బందిలో 2 శాతంగా ఉంది. ఆడిట్, ట్యాక్స్ విభాగాలకు చెందిన బాధిత ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ మీటింగ్ ద్వారా లేఆఫ్స్‌ సమాచారం అందించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

తొలగింపునకు కారణాలు

ప్రస్తుత వ్యాపార డిమాండ్లకు అనుగుణంగా కంపెనీ తన శ్రామిక శక్తిని సమీకరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. మారుతున్న మార్కెట్ పరిస్థితుల మధ్య దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించే లక్ష్యంతో ఆలోచనాత్మకంగానే ఈ చర్య తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఆర్థిక అనిశ్చితి, మారుతున్న ఖాతాదారుల డిమాండ్లు, పునర్నిర్మాణ ప్రయత్నాలు వంటి అంశాలను హైలైట్‌ చేస్తూ డెలాయిట్, కేపీఎంజీ వంటి సంస్థలు కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపును ప్రకటించాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, మార్కెట్ తీరుకు అనుగుణంగా సంస్థలు మారుతున్నాయి.

ఇదీ చదవండి: దేశంలో వైర్‌లెస్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఎంతంటే..

సవాళ్లు

తొలగింపులతో ప్రభావితమైన ఉద్యోగులు తిరిగి కొలువు సాంపాదించాలంటే సవాళ్లను ఎదుర్కోకతప్పదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అకౌంటింగ్, ఫైనాన్షియల్‌ కన్సల్టింగ్ రంగంలో ఉపాధి అవకాశాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలు అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. పెరిగిన ఆటోమేషన్, వ్యాపార వ్యూహాలతో ఆడిట్, ట్యాకేషన్‌ నిపుణులు డేటా అనలిటిక్స్, అడ్వైజరీ సర్వీసులు లేదా ప్రత్యేక ఫైనాన్స్ రంగాల్లో కొత్త అవకాశాలకు అనుగుణంగా మారవలసి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement