గుడ్‌న్యూస్‌.. ఈ టాలెంట్ ఉన్నవారికి ప్రత్యేక వీసా! | Russia New Talent Visa Promises Fast Track Residency, Know The Details Here | Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌.. ఈ టాలెంట్ ఉన్నవారికి ప్రత్యేక వీసా!

Aug 18 2026 11:05 AM | Updated on Aug 18 2026 11:15 AM

Russia New Talent Visa Promises Fast Track Residency, Know The Details Here

రష్యా ప్రభుత్వం విదేశాల నుంచి ప్రతిభావంతులైన, అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులను ఆకర్షించేందుకు కొత్త టాలెంట్ వీసా (Talent Visa) విధానాన్ని తీసుకొచ్చింది. ఇది 2025 డిసెంబర్‌లో తెరమీదకు వచ్చినప్పటికీ.. 2026 ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ కొత్త వీసా రష్యాకు వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరికీ కాదు. దేశానికి ఉపయోగపడే ప్రత్యేక ప్రతిభ ఉన్న విదేశీయుల కోసం మాత్రమే.

ఈ వీసా ఎవరికంటే?
ఈ వీసా ప్రధానంగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజనీర్లు, టెక్ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రముఖ విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లు, కళాకారులు, క్రీడాకారులు, అరుదైన నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రమే. అంటే రష్యా.. టెక్నాలజీ, సైన్స్, బిజినెస్, సంస్కృతి లేదా క్రీడా రంగాలకు ఉపయోగపడే ప్రతిభ ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వనుందన్నమాట.

దరఖాస్తు ప్రక్రియ గురించి
అభ్యర్థుల దరఖాస్తులను ముందుగా 'ఏజెన్సీ ఫర్ అట్రాక్షన్ ఫారిన్ టాలెంట్ టు రష్యా' అనే సంస్థ పరిశీలిస్తుంది. అభ్యర్థి విద్య, నైపుణ్యాలు, అనుభవం, సాధించిన విజయాలను అంచనా వేసిన తర్వాత దరఖాస్తు సాధారణ ఇమ్మిగ్రేషన్ అధికారుల వద్దకు వెళ్తుంది. టాలెంట్ వీసా పొందిన వారికి టెంపరరీ రెసిడెన్స్ పర్మిట్ (TRP) విషయంలో సాధారణ కోటా వర్తించదు. అంతే కాకుండా.. సాధారణంగా ఉండే కొన్ని రష్యన్ భాషా నిబంధనల నుంచి కూడా మినహాయింపు లభించవచ్చు.

అయితే.. రష్యన్ భాష తెలిసినవారు TRP దశను దాటేసి నేరుగా పర్మనెంట్ రెసిడెన్స్ పర్మిట్ (PRP) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ సాధారణంగా విదేశీయులు PRP కోసం దరఖాస్తు చేయడానికి ముందు.. కనీసం ఎనిమిది నెలలు TRP కలిగి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి అర్హత కలిగిన వ్యక్తికి ఈ కొత్త విధానం శాశ్వత నివాసం పొందే ప్రక్రియను గణనీయంగా వేగవంతం చేయగలదు.

రష్యా లక్ష్యం ఏమిటి?
ఈ కొత్త టాలెంట్ వీసా ద్వారా రష్యా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభను దేశంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, వ్యాపారం, సంస్కృతి మరియు క్రీడల రంగాల్లో దేశానికి ఉపయోగపడే నిపుణులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యం. సాధారణ ఇమ్మిగ్రేషన్ కోటాలపై మాత్రమే ఆధారపడకుండా, దేశానికి అవసరమైన నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ కొత్త విధానంలో ప్రధాన మార్పుగా చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement