దేశంలోని పలు వాహన తయారీ సంస్థలు.. తమ వాహనాల ధరలను పెంచనున్న నేపథ్యంలో, టాటా మోటార్స్ కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
కొత్త సవరణతో, టాటా హారియర్ ఈవీ ధర రూ. 11,000 వరకు పెరిగింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 21.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే.. ఈ ధరల పెంపు అన్ని వేరియంట్లలో ఒకేలా లేదు. కాగా.. టాప్-స్పెక్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 30.54 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ఇదిలా ఉండగా.. టాటా మోటార్స్ ఇటీవల తన BaaS ధరల కార్యక్రమాన్ని మొత్తం EV శ్రేణికి విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద, హారియర్ EV యొక్క ప్రారంభ ధరను రూ. 7.30 లక్షలు తగ్గించడంతో, దాని ప్రారంభ ధర రూ. 14.49 లక్షలకు చేరింది. దీనితో పాటు, ప్రతి కిలోమీటరుకు రూ. 5.90 బ్యాటరీ అద్దె రుసుము కూడా ఉంటుంది.
ఇదీ చదవండి: గాంధీ ఫొటోకు ముందు.. భారత కరెన్సీపై ఏముండేది?


