
ఓపెన్ఏఐ ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని విస్తరించడంలో భాగంగా.. భారతదేశంలో తన మొదటి కార్యాలయాన్ని ప్రారభించడానికి సిద్ధమైంది. ఇప్పుడు జాబ్స్ కోసం కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మూడు ఉద్యోగాలు ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఓపెన్ఏఐలో జాబ్స్
అకౌంట్ డైరెక్టర్, డిజిటల్ నేటివ్స్
అకౌంట్ డైరెక్టర్, లార్జ్ ఎంటర్‌ప్రైస్
అకౌంట్ డైరెక్టర్, స్ట్రాటజీస్
ఈ ఉద్యోగాలు ఢిల్లీ, ముంబై లేదా బెంగళూరులో ఉండవచ్చు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఓపెన్ఏఐ కెరీర్ పేజీలో అప్లై చేసుకోవచ్చు.
మా మొదటి ఆఫీస్ ప్రారభించడం, దీనికోసం స్థానికంగా ఒక టీమ్ ఏర్పాటు చేసుకోవడం అనేది.. లేటెస్ట్ ఏఐను మరింత అందుబాటులోకి తీసుకురావడం. భారతదేశంలో ఏఐను నిర్మించడానికి మా నిబద్దతతో మొదటి అడుగు అని.. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ప్రకటనలో తెలిపారు. అంతే కాకుండా.. సెప్టెంబర్‌లో భారతదేశాన్ని సందర్శించడానికి తాను ఉత్సాహంగా ఉన్నానని అన్నారు.
ఇదీ చదవండి: డబ్బు అదా చేయడానికి 10-30-50 రూల్: రాధిక గుప్తా
భారతదేశంలో ఆఫీస్ ప్రారభించడం అనేది.. ప్రభుత్వ ఇండియాఏఐ మిషన్‌కు ఓపెన్ఏఐ మద్దతులో భాగం. కంపెనీ ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు, విద్యావేత్తలు, డెవలపర్లు, నిపుణులకు మెరుగైన సేవలందించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ ప్రారంభించి మరింత అందుబాటులో ఉండనుంది. ఇందులో భాగంగానే ఉద్యోగులను నియమించుకోవడానికి సంస్థ సిద్ధమైంది.