
డబ్బు సంపాదించాలన్నా.. డబ్బు ఆదా చేయాలన్నా, తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ఖర్చులు పెరిగినప్పుడు, ఆదా చేయడం ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ & సీఈఓ రాధిక గుప్తా మాత్రం ఓ ఫార్మలా సూచిస్తూ.. డబ్బును, ఇలా అదా చేయొచ్చని వెల్లడించారు
నిరంజన్ అవస్థితో కలిసి రాసిన తన కొత్త పుస్తకం 'మ్యాంగో మిలియనీర్'లో రాధిక గుప్తా 10-30-50 రూల్ గురించి వివరించారు. ''అదా చేయడం అంటే.. క్రికెట్ మ్యాచ్‌కు ముందు చేసే ప్రాక్టీస్ అని అన్నారు. ఆర్ధిక విజయానికి తప్పకుండా పునాది అవసరం. ఏ క్రేడాకారుడు.. సాధన లేకుండా మ్యాచ్‌లోకి అడుగు పెట్టాలని కలలు కనడు. అలాగే.. పెట్టుబడిదారుడు కూడా, ముందు పొదుపులో నైపుణ్యం సాధించాలి, అప్పుడే విజయం సాధిస్తాడు'' అని వెల్లడించారు.
రాధిక గుప్తా 10-30-50 నియమం
20 ఏళ్లలో 10 శాతం: పొదుపు చేయడం చిన్నగా ప్రారంభించండి. పొదుపు చేయడం అంటే.. మీ భవిష్యత్తుకు మీరే డబ్బు చెల్లించుకోవడం ని రాధికా గుప్తా పేర్కొన్నారు. ఆడంబరమైన, అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం మానుకోవాలి.
30 ఏళ్ల నుంచి 40 ఏళ్లలో 30 శాతం: ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా వ్యాపారం బాగా వృద్ధి చెందుతున్నప్పుడు.. వస్తున్న ఆదాయంలో పొదుపును 30 శాతానికి పెంచండి.
40 ఏళ్లు పైబడిన వారు 50 శాతం: పదవీ విరమణ, పిల్లల విద్య కోసం ఖర్చులు పెరుగుతున్న సమయంలో ఆదాయం కొంత ఎక్కువ పొదుపు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు సంపాదించే ఆదాయంలో 50 శాతం వరకు పొదుపు చేయండి.
ఇదీ చదవండి: ఫెడ్ చైర్మన్ కీలక ప్రకటన: బంగారం ధరల్లో ఊహించని మార్పు!