breaking news
Radhika Gupta
-
బిగ్ దివాలీ గిఫ్ట్.. మరిన్ని ప్లీజ్.. జీఎస్టీ బొనాంజాపై తలో మాట
దేశంలో జీఎస్టీ వ్యవస్థను హేతుబద్ధీకరిస్తూ సెప్టెంబర్ 22 నుండి 5 శాతం, 18 శాతం సరళీకృత రెండు-రేట్ల వ్యవస్థకు మారాలని జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ వ్యాపార దిగ్గజాలు స్వాగతించారు. రాధికా గుప్తా, హర్ష్ గోయెంకా, ఆనంద్ మహీంద్రా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ చర్యను పౌరులకు "పెద్ద దీపావళి బహుమతి" గా అభివర్ణించారు. 'ప్రతి భారతీయుడికి బిగ్ దీవాలీ గిఫ్ట్. రోజువారీ నిత్యావసరాలు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయ ముడి ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించారు. చౌకైన కిరాణా సరుకులు, ఆరోగ్య సంరక్షణలో ఉపశమనం, సరసమైన విద్య, రైతులకు మద్దతు" అని ఆయన ‘ఎక్స్’ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ సంస్కరణ జీవనాన్ని సులభతరం చేయడం, ఆర్థిక వ్యవస్థను పెంచడం అనే ద్వంద్వ ప్రయోజనాలతో "నెక్ట్స్-జనరేషన్ జీఎస్టీ" దిశగా ఒక అడుగు అని అన్నారు.ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ ఎండీ, సీఈవో రాధికా గుప్తా ‘ఎక్స్’ తన అభిప్రాయాలను పంచుకుంటూ.. "చాలా క్లిష్టమైన సమయంలో చాలా ప్రగతిశీలమైన చర్య, ఇది డిమాండ్, సెంటిమెంట్ రెండింటినీ పెంచడానికి సహాయపడుతుంది! ప్రపంచం మనల్ని ఒక మూలకు నెట్టినప్పుడు, మరింత గట్టిగా పోరాడటానికి మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాలి" అని రాసుకొచ్చారు.మరిన్ని సంస్కరణలు ప్లీజ్...మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'మనం ఇప్పుడు యుద్ధంలో చేరాం. మరింత వేగవంతమైన సంస్కరణలు వినియోగాన్ని, పెట్టుబడులను వెలికితీసేందుకు ఖచ్చితమైన మార్గం. ఇవి ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తాయి. ప్రపంచంలో భారతదేశ స్వరాన్ని పెంచుతాయి. కానీ స్వామి వివేకానందుని ప్రసిద్ధ ఉపదేశాన్ని గుర్తు చేసుకుందాం: 'లేవండి, మేల్కొనండి. లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆపవద్దు'. కాబట్టి, మరిన్ని సంస్కరణలు, ప్లీజ్...’ అంటూ పోస్ట్ చేశారు.చదవండి: జీఎస్టీ భారీగా తగ్గింపు.. వీటి ధరలు దిగొస్తాయ్నిత్యావసరాలు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వ్యవసాయ ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన తర్వాత ఈ స్పందనలు వచ్చాయి. ప్రస్తుతమున్న 12 శాతం, 28 శాతం కేటగిరీలను విలీనం చేస్తూ రేట్లను రెండు శ్లాబులుగా హేతుబద్ధీకరించాలని 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. Big Diwali gift 🎁 for every Indian!GST on daily essentials, healthcare, education & farming inputs slashed.🛒 Cheaper groceries💊 Relief in healthcare📚 Affordable education🚜 Support for farmersNext-gen GST = ease of living + boost to economy.— Harsh Goenka (@hvgoenka) September 3, 2025Extremely progressive step at a very critical time that should help boost both demand and sentiment! When the world pushes us into a corner, we push ourselves to fight back harder. pic.twitter.com/DnU7k5tTgq— Radhika Gupta (@iRadhikaGupta) September 3, 2025We have now joined the battle…More and faster reforms are the surest way to unleash consumption and investment.Those, in turn, will expand the economy and amplify India’s voice in the world.But let’s remember the famous exhortation of Swami Vivekananda:“Arise, awake, and… https://t.co/rDoRtjsCw1— anand mahindra (@anandmahindra) September 3, 2025 -
డబ్బు అదా చేయడానికి 10-30-50 రూల్: రాధిక గుప్తా
డబ్బు సంపాదించాలన్నా.. డబ్బు ఆదా చేయాలన్నా, తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ఖర్చులు పెరిగినప్పుడు, ఆదా చేయడం ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ & సీఈఓ రాధిక గుప్తా మాత్రం ఓ ఫార్మలా సూచిస్తూ.. డబ్బును, ఇలా అదా చేయొచ్చని వెల్లడించారునిరంజన్ అవస్థితో కలిసి రాసిన తన కొత్త పుస్తకం 'మ్యాంగో మిలియనీర్'లో రాధిక గుప్తా 10-30-50 రూల్ గురించి వివరించారు. ''అదా చేయడం అంటే.. క్రికెట్ మ్యాచ్‌కు ముందు చేసే ప్రాక్టీస్ అని అన్నారు. ఆర్ధిక విజయానికి తప్పకుండా పునాది అవసరం. ఏ క్రేడాకారుడు.. సాధన లేకుండా మ్యాచ్‌లోకి అడుగు పెట్టాలని కలలు కనడు. అలాగే.. పెట్టుబడిదారుడు కూడా, ముందు పొదుపులో నైపుణ్యం సాధించాలి, అప్పుడే విజయం సాధిస్తాడు'' అని వెల్లడించారు.రాధిక గుప్తా 10-30-50 నియమం20 ఏళ్లలో 10 శాతం: పొదుపు చేయడం చిన్నగా ప్రారంభించండి. పొదుపు చేయడం అంటే.. మీ భవిష్యత్తుకు మీరే డబ్బు చెల్లించుకోవడం ని రాధికా గుప్తా పేర్కొన్నారు. ఆడంబరమైన, అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం మానుకోవాలి.30 ఏళ్ల నుంచి 40 ఏళ్లలో 30 శాతం: ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా వ్యాపారం బాగా వృద్ధి చెందుతున్నప్పుడు.. వస్తున్న ఆదాయంలో పొదుపును 30 శాతానికి పెంచండి.40 ఏళ్లు పైబడిన వారు 50 శాతం: పదవీ విరమణ, పిల్లల విద్య కోసం ఖర్చులు పెరుగుతున్న సమయంలో ఆదాయం కొంత ఎక్కువ పొదుపు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు సంపాదించే ఆదాయంలో 50 శాతం వరకు పొదుపు చేయండి.ఇదీ చదవండి: ఫెడ్ చైర్మన్ కీలక ప్రకటన: బంగారం ధరల్లో ఊహించని మార్పు! -
ఎవరు చెప్పినా వినండి.. కానీ..
డబ్బు ఖర్చులు, పెట్టుబడులపై ఒక్కొక్కరి నిర్ణయాలు ఒక్కోలా ఉంటాయి. మనకు బాగా తెలిసినవారు డబ్బుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో దాదాపు వాటినే మనలో చాలా మంది అనుసరిస్తుంటారు. కానీ ఒక్కొక్కరి భవిష్యత్తు అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలుండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈఓ రాధికా గుప్తా ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.‘డబ్బు విషయానికి వస్తే ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. మీ అంకుల్ స్మాల్ క్యాప్ షేర్లపై పెట్టుబడి పెట్టొచ్చు. క్రిప్టోనే భవిష్యత్తు అని మీ స్నేహితుడు ఎంచుకోవచ్చు. మీ పక్కింటివారు ఫిక్స్డ్ డిపాజిట్లలో మాత్రమే తమ పెట్టుబడిని కొనసాగించవచ్చు. అయినంత మాత్రాన వారి నిర్ణయాలను కాపీ కొట్టాలా? కాదు కదా.. మీ పోర్ట్ ఫోలియో మీ పరిస్థితులకు అనుగుణంగా, అవసరాలను తీర్చేలా ఉండాలి. పొరుగువారిని అనుసరించి పెట్టుబడులు పెట్టకూడదు. మీ సొంత ప్రణాళికలు రూపొందించుకోండి. చాలా ఉచిత సలహాలు మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తాయి. మీ అవసరాలకు సరిపోని వాటిని ఎంచుకోకూడదు. మీ ఆత్మీయులు చెప్పింది వినండి. కానీ మీకు నిజంగా ఏది అవసరమో అదే చేయండి’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: భవిష్యత్తులో కొదవలేని బిజినెస్ ఇదే..ప్రతి ఒక్కరికీ వారి సొంత పెట్టుబడి మార్గం ఉండాలి. కానీ చాలా మంది పక్కవారి అవసరాలను పరిగణించుకోకుండా గుడ్డిగా వారి నిర్ణయాలను అనుసరిస్తారు. మెరుగైన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోను నిర్మించడం చాలాముఖ్యం. పిల్లల చదువు కోసం మీరు పొదుపు చేయవచ్చు.. హాలిడే కోసం ప్లాన్ చేయవచ్చు.. లేదా ఎమర్జెన్సీ నిధిని ఏర్పాటు చేయవచ్చు. అందుకు వేరొకరిని అనుసరించకూడదని నిపుణులు చెబుతున్నారు. -
బాత్రూమ్లో ఏడ్చేదాన్ని: పనిగంటలపై రాధికా గుప్తా
వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' (Narayana Murthy), 70 గంటలు కాదు.. వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ 'సుబ్రమణ్యన్' (Subrahmanyan) పేర్కొన్నారు. తాజాగా ఇప్పుడు ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ 'రాధికా గుప్తా' (Radhika Gupta) తాను వారానికి 100 గంటలు పనిచేశానని వెల్లడించారు.రాధికా గుప్తా ఉద్యోగంలో చేరిన మొదటి రోజుల్లో వారానికి 100 గంటలు పనిచేసాను. అలా నాలుగు నెలల పాటు పని చేసినట్లు పేర్కొన్నారు. పనిగంటలు పెరిగినంత మాత్రమే ఉత్పాతకత పెరుగుతుందనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే. ఇది ఉద్యోగిపై ఒత్తిడిని పెంచడమే కాకుండా.. మానసికంగా కృంగదీస్తుంది. కుటుంబాలకు సైతం దూరం చేస్తుందని అన్నారు.ఛాయిస్, హార్డ్‌వర్క్, ఆనందం పేరుతో ట్వీట్ చేస్తూ.. రాధికా గుప్తా ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పనిగంటలపై పెద్ద డెబిట్ జరుగుతోంది. కాబట్టి ఈ అంశం మీద ట్వీట్ చేయాలా? వద్దా? అని ఆలోచించాను. అయితే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనే అంశం మీద చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.కష్టపడి పనిచేయడం ముఖ్యం. నేను దానిని నేర్చుకున్నాను. మనిషి ఎదగడానికి ఉన్న ఏకైక మార్గం కష్టపడిపని చేయడం అని నమ్ముతున్నాను. కష్టపడి పనిచేసే వ్యక్తి వేగంగా ఎదుగుతాడని కూడా నేను నమ్ముతానని అన్నారు.ఇక పని గంటల విషయానికి వస్తే.. నేను ఉద్యోగంలో చేరిన మొదటిరోజుల్లో, మొదటి ప్రాజెక్ట్‌లో నెలకు వారానికి 100 గంటలు, రోజుకు 18 గంటలు పని చేశాను. పని ఒత్తిడి తట్టుకోలేక ఆఫీసు బాత్రూమ్లోకి వెళ్లి ఏడ్చేదాన్ని. కొన్ని సార్లు తెల్లవారుజామున 2 గంటలకు తినేదాన్ని. ఈ కారణంగానే రెండు సార్లు ఆసుపత్రిలో చేరాను. బ్యాంకింగ్, కన్సల్టింగ్ మొదలైన రంగాలలో ఉద్యోగాలు చేసే నా స్నేహితులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు.ఎక్కువ గంటలు పనిచేసినంత మాత్రాన.. ఎక్కువ ఉత్పాదకత ఉండదు. ఉన్న సమయంలో ఎంత సమర్ధవంతంగా పనిచేశామన్నదే ముఖ్యం అని రాధికా గుప్తా పేర్కొన్నారు. పని గంటలు ఎక్కువైతే.. ఆందోళన, గుండెపోటు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతూ.. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తరువాత కూడా ఇబ్బందులను కలిగిస్తుందని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ప్రపంచంలోని చాలా అభివృద్ధి చెందిన దేశాలలో ఉద్యోగులు రోజుకు గరిష్టంగా 8 గంటలు మాత్రమే పనిచేస్తారు. అయితే ఆ సమయంలో ఉత్పాదకత ఉండేలా చూసుకుంటారు. కాబట్టి సమయానికి ఆఫీసుకు రండి, చేయాల్సిన పనిని పూర్తి చేయండి. అవసరమైన సమావేశాలను మాత్రమే నిర్వహించండి, టెక్నాలజీని కావలసిన విధంగా ఉపయోగించుకోండని రాధికా గుప్తా పేర్కొన్నారు.ఇదీ చదవండి: టెక్ దిగ్గజం కీలక రిపోర్ట్: వేలాది ఉద్యోగులు బయటకుభారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి మనమందరం దోహదపడాలి. కానీ మనం అలా చేస్తున్నప్పుడు, ఆ అభివృద్ధి ఫలాలను ఆస్వాదించడానికి కూడా మనం ప్రయత్నించాలి. పని చేస్తూనే కుటుంబాలతో కలిసి ఉండటం.. పిల్లలకు మెరుగైన జీవితాలను అందించడం వంటి వాటి మీద కూడా దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు.నేను ఎంతోమంది యువతను.. ముఖ్యంగా మహిళలకు కలుస్తుంటాను. కుటుంబం & కెరీర్ కలిసి ఉండలేవనే భయం కారణంగా తమకు కుటుంబం ఉండాలా వద్దా అని వారు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న నన్ను చాలా భయపెడుతుంది. అయితే ప్రతి ఒక్కరూ.. వికసిత్ భారత్ కల సాకారానికి దోహదపడుతూనే.. పని - జీవితంతో సంతోషాన్ని ఆస్వాదించాలని రాధికా గుప్తా స్పష్టం చేశారు.Choices, Hard Work and Happiness I debated whether to write this post, because the risk of being misquoted on this issue in this clickbait world is high. But I am trying to share what is a nuanced point of view on the issue of work-life balance.1. Hard work is important and…— Radhika Gupta (@iRadhikaGupta) January 11, 2025