బిగ్‌ దివాలీ గిఫ్ట్‌.. మరిన్ని ప్లీజ్.. జీఎస్టీ బొనాంజాపై తలో మాట | Indian Industry Leaders Hail GST Reform: Two-Slab System from Sept 22 Seen as Big Diwali Gift | Sakshi
Sakshi News home page

బిగ్‌ దివాలీ గిఫ్ట్‌.. మరిన్ని ప్లీజ్.. జీఎస్టీ బొనాంజాపై తలో మాట

Sep 4 2025 12:41 PM | Updated on Sep 4 2025 1:28 PM

Big Diwali gift How Indian business leaders reacted to GST Council's rate cuts

దేశంలో జీఎస్టీ వ్యవస్థను హేతుబద్ధీకరిస్తూ సెప్టెంబర్ 22 నుండి 5 శాతం, 18 శాతం సరళీకృత రెండు-రేట్ల వ్యవస్థకు మారాలని జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ వ్యాపార దిగ్గజాలు  స్వాగతించారు. రాధికా గుప్తా, హర్ష్ గోయెంకా, ఆనంద్ మహీంద్రా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ చర్యను పౌరులకు "పెద్ద దీపావళి బహుమతి" గా అభివర్ణించారు. 'ప్రతి భారతీయుడికి బిగ్ దీవాలీ గిఫ్ట్. రోజువారీ నిత్యావసరాలు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయ ముడి ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించారు. చౌకైన కిరాణా సరుకులు, ఆరోగ్య సంరక్షణలో ఉపశమనం, సరసమైన విద్య, రైతులకు మద్దతు" అని ఆయన ‘ఎక్స్’ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ సంస్కరణ జీవనాన్ని సులభతరం చేయడం, ఆర్థిక వ్యవస్థను పెంచడం అనే ద్వంద్వ ప్రయోజనాలతో "నెక్ట్స్-జనరేషన్ జీఎస్టీ" దిశగా ఒక అడుగు అని అన్నారు.

ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ ఎండీ, సీఈవో రాధికా గుప్తా ‘ఎక్స్’ తన అభిప్రాయాలను పంచుకుంటూ.. "చాలా క్లిష్టమైన సమయంలో చాలా ప్రగతిశీలమైన చర్య, ఇది డిమాండ్, సెంటిమెంట్ రెండింటినీ పెంచడానికి సహాయపడుతుంది! ప్రపంచం మనల్ని ఒక మూలకు నెట్టినప్పుడు, మరింత గట్టిగా పోరాడటానికి మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాలి" అని రాసుకొచ్చారు.

మరిన్ని సంస్కరణలు ప్లీజ్...
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'మనం ఇప్పుడు యుద్ధంలో చేరాం. మరింత వేగవంతమైన సంస్కరణలు వినియోగాన్ని, పెట్టుబడులను వెలికితీసేందుకు ఖచ్చితమైన మార్గం. ఇవి ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తాయి. ప్రపంచంలో భారతదేశ స్వరాన్ని పెంచుతాయి. కానీ స్వామి వివేకానందుని ప్రసిద్ధ ఉపదేశాన్ని గుర్తు చేసుకుందాం: 'లేవండి, మేల్కొనండి. లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆపవద్దు'. కాబట్టి, మరిన్ని సంస్కరణలు, ప్లీజ్...’ అంటూ పోస్ట్‌ చేశారు.

చ‌ద‌వండి: జీఎస్టీ భారీగా త‌గ్గింపు.. వీటి ధ‌ర‌లు దిగొస్తాయ్‌

నిత్యావసరాలు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వ్యవసాయ ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన తర్వాత ఈ స్పందనలు వచ్చాయి. ప్రస్తుతమున్న 12 శాతం, 28 శాతం కేటగిరీలను విలీనం చేస్తూ రేట్లను రెండు శ్లాబులుగా హేతుబద్ధీకరించాలని 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement