యాపిల్‌ కొత్త సీఈవో ఎవరు? | Who Is Next Apple CEO After Tim Cook? | Sakshi
Sakshi News home page

యాపిల్‌ కొత్త సీఈవో ఎవరు?

Nov 15 2025 3:50 PM | Updated on Nov 15 2025 4:16 PM

Who Is Next Apple CEO After Tim Cook?

టిమ్ కుక్ (Tim Cook)కు వచ్చే ఏడాదికి 65 ఏళ్లు నిండుతాయి. 2011లో యాపిల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఈయన.. కంపెనీ నుంచి 2026లో నిష్క్రమించే అవకాశం ఉంది. కుక్ పదవి నుంచి తప్పుకున్న తరువాత.. ఆ స్థానంలోకి ఎవరు రావచ్చనే దానిపై ఇప్పటికే చర్చ మొదలైపోయింది. టెక్ ప్రపంచంలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న పెద్ద ప్రశ్న కూడా ఇదే!. కంపెనీ బోర్డు, ఇతర సీనియర్ అధికారులు సైతం.. ఆ స్థానంలో కూర్చునే వ్యక్తిని ఎంపికచేయడంలో నిమగ్నమై ఉన్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా.. యాపిల్ కంపెనీ నుంచి ఎంతోమంది ఉన్నత స్థాయి ఉద్యోగులు వైదొలిగారు. ఈ జాబితాలో డిజైన్ చీఫ్ జోనీ ఐవ్, రిటైల్ హెడ్ ఏంజెలా అహ్రెండ్ట్స్, సీఎఫ్ఓ లూకా మాస్ట్రీ, సీఓఓ జెఫ్ విలియమ్స్ ఉన్నారు. వీరు కంపెనీ నుంచి వైదొలిగినప్పుడు ఇంత పెద్ద చర్చ జరగలేదు. కానీ టిమ్ కుక్ నిష్క్రమణ తప్పకుండా చర్చనీయాంశమే. ఎందుకంటే.. ఆయన స్థానాన్ని పొందే వ్యక్తి యాపిక్ సంస్థలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. అంతటి వ్యక్తి 'జాన్ టర్నస్' అని వినిపిస్తోంది.

ఎవరీ జాన్ టర్నస్
జాన్‌ టర్నస్‌.. యాపిల్ కంపెనీలో హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్. ఆయన దాదాపు 24 సంవత్సరాలుగా యాపిల్‌లో ఉంటూ.. కీలక పదవులను చేపట్టారు. ఈయన వ్యూహాలు కూడా హార్డ్‌వేర్ పాత్రకు మించి ఉంటాయి. ప్రస్తుతం ఈయన వయసు 50 ఏళ్లు. యాపిల్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నప్పుడు టిక్ కుక్ వయసు 50 సంవత్సరాలే. అంతే కాకుండా జాన్‌ టర్నస్‌కు టిమ్ కుక్ దగ్గర మంచి పేరు ఉంది. ఈయన యాపిల్ మొట్టమొదటి కొత్త ఐఫోన్ ఫారమ్ ఫ్యాక్టర్ అయిన ఐఫోన్ ఎయిర్‌ను పరిచయం చేశారు. అయితే సీఈఓ బాధ్యతల నుంచి వైదొలిగే అంశం గురించి టిమ్ కుక్ ఇప్పటివరకు ఎలాంటి ప్రస్తావన చేయలేదు.

స్టీవ్ జాబ్స్ మరణించిన కొన్ని నెలలకు టిమ్ కుక్ యాపిల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన నాయకత్వంలో సంస్థ విలువ 350 బిలియన్ డాలర్ల నుంచి నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేరింది. కాగా కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి.. తన తరువాత సీఈఓగా బాధ్యతలు స్వీకరించాలని కుక్ గతంలో కూడా వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే బహుశా.. ప్రస్తుతం వస్తున్న పుకార్లు నిజమయ్యే అవకాశం ఉందని, జాన్ టర్నస్ సీఈఓగా బాధ్యతలు చేపట్టవచ్చని తెలుస్తోంది.

ఇదీ చదవండి: సొంత డబ్బుతో కాదు.. అప్పు చేసి ఇల్లు కొనండి!: రాబర్ట్ కియోసాకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement