
ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇటీవల 1.5 లక్షల సీజన్ ఉద్యోగాలను ప్రకటించిన తరువాత.. ఫ్లిప్‌కార్ట్ 2.2 లక్షల కంటే ఎక్కువ సీజనల్ ఉద్యోగాలను ప్రకటించింది. తమ కస్టమర్లకు సరైన సమయంలో ఉత్పత్తులను అందించడంలో భాగంగానే ఈ చర్య తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ప్రతి సంవత్సరం పండుగ సీజన్‌లో ఈ కామర్స్ సంస్థలు సీజనల్ ఉద్యోగాలను ప్రకటిస్తూ ఉంటాయి. ఈ ఏడాది కూడా దేశ వ్యాప్తంగా.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ తమ సేవలను అందించడానికి ఫ్లిప్‌కార్ట్ సన్నద్ధమైంది. ముఖ్యంగా టైర్ 1, టైర్ 2 నగరాల్లో ఎక్కువమంది యువతకు ఉపాధి కల్పించడంపై కంపెనీ ద్రుష్టి పెట్టింది.
ఉద్యోగ నియామకాలు.. ప్రధానంగా సప్లైచైన్, లాజిస్టిక్, లాస్ట్ మైల్ డెలివరీ వంటి విభాగాల్లో ఉన్నాయి. కంపెనీ అందిస్తున్న ఉద్యోగాలను మహిళలు, దివ్యాంగులు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: పండుగ సీజన్.. అమెజాన్‌లో 1.5 లక్షల ఉద్యోగాలు