
కోవిడ్ సమయంలో దాదాపు అన్ని కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులను 'వర్క్ ఫ్రమ్ హోమ్'కు పరిమితం చేశాయి. అయితే పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. ఇప్పుడు దాదాపు అన్ని సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీస్ బాట పట్టించాయి. కాగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే.. ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఎన్ని ఇబ్బందులున్నా కార్యాలయానికి రావాల్సిందే అంటూ పట్టుపడుతున్నాయి.
ఇటీవల రెడ్దిట్ వేదికగా ఒక పోస్ట్ వైరల్ అయింది. ఇందులో మా అత్త, వాళ్ల సోదరుడు ఒక స్కూటర్ ప్రమాదంలో గాయపడ్డారు. నా భార్య చెల్లెలు బెంగళూరులో ఐటీ జాబ్ చేస్తోంది. ఆమె తన తల్లికి ప్రమాదం జరగడంతో.. వారిని చూసుకుంటూ, నెల రోజులు వర్క్ ఫ్రొమ్ హోమ్ సదుపాయం కల్పించాలని కంపెనీని కోరింది. దీనికోసం వాళ్ల ఎమ్ఆర్ఐ స్కాన్, పోలీస్ రిపోర్ట్ వంటివి కూడా షేర్ చేసింది. అయితే కంపెనీ తనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించడానికి ఒప్పుకోలేదు.

నిజానికి ఆమె సెలవు అడగలేదు, ఇంటి నుంచి పనిచేస్తానని అభ్యర్థించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కార్పొరేట్ కంపెనీల తీరు ఇలా ఉందని.. రెడ్దిట్ యూజర్ పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఇండియాలోని ప్రైవేట్ కంపెనీల వర్క్ కల్చర్ గురించి విమర్శించారు.
ఇదీ చదవండి: 2026లో జీతాలు పెరిగేది వీరికే!