
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. వినాయక చవితి, దీపావళి ఇలా వరుసగా పండుగలు వచ్చేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఏకంగా 1.5 లక్షల సీజనల్ ఉద్యోగాలను ప్రకటించింది. పండుగ సీజన్లో తమ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి ఈ భారీ నియామకాలను చేపడుతోంది.
ఢిల్లీ, ముంబై వంటి మెట్రోల నగరాలూ.. రాంచీ, కోయంబత్తూర్ వంటి చిన్న పట్టణాల వరకు సుమారు 400 కంటే ఎక్కువ నగరాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఇందులో వేలాదిమంది మహిళలకు, 2000 కంటే కంటే ఎక్కువ దివ్యాంగులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం.
అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, సార్టింగ్ సెంటర్లు.. భారతదేశం అంతటా లాస్ట్ మైల్ డెలివరీ నెట్‌వర్క్‌లలో ప్రత్యక్ష & పరోక్ష ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అమెజాన్ ఇండియా స్పష్టం చేసింది. గత కొన్ని నెలలుగా, అమెజాన్ భారతదేశంలోని తన కార్యకలాపాల నెట్‌వర్క్‌లో రూ. 2000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా టైర్-2, టైర్-3 నగరాల్లో ఐదు కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, 30 కొత్త డెలివరీ స్టేషన్లను ప్రారంభించింది.
ఇదీ చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్స్